తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కమెడియన్​ అలీకి కాబోయే అల్లుడు ఏం చేస్తారో తెలుసా - Comedian Ali daughter husband

Comedian Ali daughter engazement టాలీవుడ్​ కమెడియన్​ అలీ కూతురు నిశ్చితార్థం ఇటీవలే ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అలీ బంధువులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అలీకి కాబోయే అల్లుడు ఎవరు? ఏం చేస్తుంటారు? వంటి విషయాలను ఆరా తీయడంలో బిజీ అయ్యారు నెటిజన్లు. ఇంతకీ ఆయన ఎవరంటే.

Comedian Ali daughter husband work
కమెడియన్​ అలీకి కాబోయే అల్లుడు ఏం చేస్తాడో తెలుసా

By

Published : Aug 28, 2022, 11:47 AM IST

Updated : Aug 28, 2022, 1:40 PM IST

టాలీవుడ్​ కమెడియన్​ అలీ పెద్ద కుమెర్తె ఫాతిమా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుంది. దీనికి సంబంధించి ఎంగేజ్‌మెంట్‌ వీడియోను జుబేదా అలీ ఇటీవలే తన ఛానెల్‌లో షేర్‌ చేయగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌ వేడుకకు సన్నిహితులు సహా బ్రహ్మానందం, సాయికుమార్‌ వంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు.

కమెడియన్​ అలీ కూతురు ఎంగేజ్​మెంట్​ వేడుకలో బ్రహ్మానందం

అయితే అలీకా కాబోయే అల్లుడు ఏం ఎవరు, ఏం చేస్తారు? అంటూ నెటిజన్లలో క్యూరియాసిటీ పెరిగింది. ఆయన గురించి ఆరా తీయడం ప్రారంభించారు. అయితే అలీ అల్లుడు డాక్టర్‌ అని తెలిసింది. అంతేకాకుండా అలీ వియ్యంకుల ఇంట్లో అందరూ డాక్టర్లేనట. అలీ కూతురు ఫాతిమా సైతం ఈ మధ్య మెడిసన్‌ కంప్లీట్‌ చేసింది. తమ కుటుంబంలో ఫాతిమానే మొదటి డాక్టర్‌ అంటూ అలీ దంపతులు ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే.

కమెడియన్​ అలీ కూతురు ఎంగేజ్​మెంట్​

కాగా, టాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆయన ఇప్పటివరకు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవలె లైగర్‌ సినిమాలో నటించారు. ఇక బుల్లితెర‌పై హోస్ట్‌గానూ అలరిస్తున్నారు. మరోవైపు ఆయన భార్య జుబేదా అలీ సైతం సొంతంగా యూట్యూబ్‌ ఛానెల్‌తో పాపులారిటీని దక్కించుకున్నారు.

కమెడియన్​ అలీ కూతురు ఎంగేజ్​మెంట్​

ఇదీ చూడండి: ఘనంగా కమెడియన్​ ఆలీ కూతురు నిశ్చితార్థం, వీడియో చూశారా

Last Updated : Aug 28, 2022, 1:40 PM IST

ABOUT THE AUTHOR

...view details