Rajamouli-Mahesh combo: ప్రముఖ దర్శకుడు రాజమౌళి, నటుడు మహేశ్ బాబు కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కబోతుంది. అధికారికంగా ప్రకటించకపోయినా పలు ఇంటర్వ్యూల్లో నిర్మాత కె. ఎల్. నారాయణ, రాజమౌళి ఈ విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సమాచారం తెలిసిన క్షణం నుంచే సినీ అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. మహేశ్ బాబును రాజమౌళి ఎలాంటి పాత్రలో చూపిస్తారు? ఏ నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తారు? హీరోయిన్ ఎవరు? టైటిల్ ఏంటి? అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలో ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. వాటిని పక్కన పెడితే, ఈ సినిమాను ఎప్పుడు ప్రారంభించబోతున్నారో రాజమౌళి ఆంగ్ల మీడియాకు తెలిపారు. ‘‘స్టోరీని పక్కాగా సిద్ధం చేసుకునేందుకు, ప్రీ ప్రొడక్షన్‌కు సుమారు 7 నెలల సమయం పడుతుంది. ఈ ఏడాది చివరిలో షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నా’’ అని చెప్పారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లతో రాజమౌళి రూపొందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఇటీవల విడుదలై, తెలుగు సినిమా రికార్డులను తిరగరాస్తోంది.
రాజమౌళి- మహేశ్ సినిమా పట్టాలెక్కేది అప్పుడేనట! - mahesh babu rajamouli movie
Rajamouli-Mahesh combo: రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే దానిపై క్లారిటీ ఇచ్చారు రాజమౌళి.
ఆసక్తిగా ‘పోలీసోడు’ ట్రైలర్
‘గజరాజు’ సినిమాతో తెలుగు వారికి దగ్గరైన తమిళ నటుడు విక్రమ్ ప్రభు. ఆయన హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘తానక్కరన్’ (తెలుగు టైటిల్.. పోలీసోడు). ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలకానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ నెల 8 నుంచి ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్‌కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. పోలీసు అధికారుల శిక్షణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. సీనియర్ శిక్షణాధికారి, కథానాయకుడి మధ్య సాగే సన్నివేశాలు సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. తమిళ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి నాయర్, లాల్, ఎం. ఎస్. భాస్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పొటెన్షియల్ స్టూడియోస్ ఎల్.ఎల్.పి. సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు.