తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'బ్రహ్మస్త్రం' కోసం చిరు.. భోళాశంకర్​లో నితిన్​!.. కొత్త పోస్టర్​తో మెగాహీరో - Bholashankar Nithin

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో మెగాస్టార్​ చిరంజీవి, నితిన్​, సాయిధరమ్​ తేజ్​, బాలీవుడ్ హీరో రణ్​బీర్​ కపూర్​ చిత్రాల సంగతులు ఉన్నాయి.

bramhastram
బ్రహ్మాస్త్రం

By

Published : Jun 13, 2022, 2:07 PM IST

Chiranjeevi voiceover Bramhastra: 'బ్రహ్మాస్త్ర'.. సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. సెప్టెంబరు 9 విడుదల కానున్న ఈ చిత్రంలో రణ్‌బీర్‌కపూర్‌, అలియా భట్‌ నాయకానాయికలు. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దక్షిణ భారతదేశంలో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి విడుదల చేస్తున్నారు. ఇందులో బిగ్‌బీ అమితాబ్‌ కీలక పాత్ర పోషిస్తుండగా.. నాగార్జున అక్కినేని, మౌనీ రాయ్‌ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. అయితే మూవీటీమ్​ తాజాగా ఓ సూపర్ అప్డేట్​ ఇచ్చింది. ఈ చిత్రానికి మెగాస్టార్​ చిరంజీవి తన గాత్రాన్ని అందించనున్నారు. వాయిస్​ ఓవర్​ చెప్పనున్నారు. ఓ స్పెషల్​ వీడియోను రిలీజ్​ చేసింది. దీంతో పాటే జున్​ 15 ట్రైలర్​ విడుదల చేయనున్నట్లు తెలిపింది.

Saidharam tej new movie: 'రిపబ్లిక్'​ తర్వాత హీరో సాయిధరమ్​ తేజ్​... దర్శకుడు సుకుమార్​, బాబీ నిర్మాణంలో ఓ కొత్త సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. మిస్టిక్​ థ్రిల్లర్​ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాకు కార్తీక్​ దుండు దర్శకుడు. తాజాగా ఈ సినిమా వర్కింట్​ టైటిల్​ 'ఎస్​డీటీ 15' పేరుతో ఓ కొత్త పోస్టర్​ను రిలీజ్​ చేసింది. డార్క్​మోడ్​లో ఉన్న ఈ పోస్టర్​లో.. చీకటిగా ఉన్న ఓ దట్టమైన అడవి మధ్యలో తేజ్​ కొంతమందితో ఏదో మాట్లాడుతున్నట్లుగా కనిపించారు. ఇది సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది.

Bholashankar Nithin: చిరంజీవి కథానాయకుడిగా ఏకే ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'భోళా శంకర్‌'. తమన్నా కథానాయిక. కీర్తిసురేష్‌ సోదరి పాత్రలో నటిస్తోంది. మెహర్‌ రమేష్‌ దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. తమిళంలో విజయవంతమైన 'వేదాలం' ఆధారంగా రూపొందుతోంది చిత్రం. అయితే తాజాగా ఈ మూవీలో హీరో నితిన్​కు ఛాన్స్​ కొట్టేసినట్లు తెలుస్తోంది. చిరు చెల్లిలిగా నటిస్తున్న కీర్తి భర్త పాత్రలో నితిన్​ నటించనున్నారని తెలిసింది. వచ్చే నెలలో సెట్స్​లో అడుగుపెట్టే అవకాశం ఉంది. త్వరలోనే ఈ చిత్ర రిలీజ్​ డేట్​ను ప్రకటించనున్నారు. 'ఆచార్య' డిజాస్టర్​ తర్వాత చిరు నుంచి ఓ పెద్ద హిట్​ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రానికి ఏకే ఎంటర్​టైన్​మెంట్​ నిర్మిస్తోంది. మహతి స్వర సాగర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు.

ఇదీ చూడండి: త్వరలోనే 'స్క్విడ్​ గేమ్'​ సీజన్​ 2.. ఈ సారి మరింత ఉత్కంఠగా

ABOUT THE AUTHOR

...view details