Waltair Veerayya First Single: 'వాల్తేరు వీరయ్య' అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్ వినిపించారు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్. సినిమాలోని ఫస్ట్ సింగిల్ ఈ వారంలోనే విడుదలచేయబోతున్నట్లు ప్రకటించారు. 'బాస్ పార్టీ' అనే పల్లవితో సాగే ఈ మాస్ సాంగ్‌లో చిరంజీవితో కలిసి బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్టెప్పులేశారు. ఈ అప్డేట్ను ఆదివారం ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు దేవిశ్రీ.
'వాల్తేరు వీరయ్య' ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ఆనందాన్ని ఆపుకోలేక లీక్ చేసిన DSP! - వాల్తేరు వీరయ్య చిరంజీవి ఊర్వశి
Waltair Veerayya First Single: మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమా ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన అప్డేట్ను మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ అనౌన్స్ చేశారు. ఈ సింగిల్ ఎప్పుడు రిలీజ్ కానుందంటే?
'బాస్ పార్టీ' సాంగ్‌ను ఇప్పుడే చూసినట్లు రికార్డింగ్ రూమ్‌లో దిగిన ఓ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ పాటలో చిరంజీవి ఎనర్జిటిక్ స్టెప్పులు మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయని, డ్యాన్స్ చూసిన ఆనందాన్ని కంట్రోల్ చేసుకోలేక ఈ న్యూస్‌ను లీక్ చేస్తున్నట్లు దేవిశ్రీప్రసాద్ ట్వీట్ చేశారు. ఫస్ట్ సింగిల్‌ను ఈ వారంలోనే రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు.
పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు నలభై నిమిషాల పాటు రవితేజ క్యారెక్టర్ ఈ సినిమాలో కనిపిస్తుందని సమాచారం. చిరంజీవికి జోడీగా శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జాలర్ల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.