తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మెగాస్టార్​ చిరు సర్​ప్రైజ్​.. ఆమిర్​ 'లాల్​సింగ్​ చద్ధా'లో.. - చిరంజీవి ఆమిర్ ఖాన్​

Chiranjeevi Lalsingh chaddha: బాలీవుడ్​ స్టార్​ హీరో​ ఆమిర్​ఖాన్​ కథానాయకుడిగా నటించిన 'లాల్​ సింగ్​ చద్ధా' గురించి మెగాస్టార్ చిరంజీవి ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్ర తెలుగు వెర్షన్​ తన సమర్పణలో విడుదల కానున్నట్లు తెలిపారు. అలాగే ఇటీవలే తన ఇంట్లో ఎక్స్‌క్లూజివ్‌ ప్రీమియర్ షో విజువల్స్ విడుదల చేశారు.

Chiranjeevi laal singh chaddha movie
చిరంజీవి లాల్​ సింగ్ చద్ధా

By

Published : Jul 16, 2022, 12:51 PM IST

Chiranjeevi Lalsingh chaddha: బాలీవుడ్​ మిస్టర్​ పర్ఫెక్షనిస్ట్​ ఆమిర్​ఖాన్​ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా 'లాల్​ సింగ్​ చద్ధా'. ఇటీవల మెగాస్టార్​ చిరంజీవి ఇంట్లో ఈ మూవీ స్పెషల్​ స్క్రీనింగ్​ వేశారు. చిరంజీవి, ఆమిర్​ఖాన్​తో పాటు దర్శకుడు రాజమౌళి, సుకుమార్​, కింగ్ నాగార్జున, నాగచైతన్య కలిసి సినిమా చూశారు. అయితే తాజాగా ఈ మూవీ గురించి చిరు ఓ అప్డేట్​ను ప్రకటించారు. ఈ మూవీ తెలుగు వెర్షన్​ను తన సమర్పణలో విడుదల కానున్నట్లు తెలిపారు.

''కొన్నేళ్ల క్రితం జపాన్ లో నా ఫ్రెండ్ ఆమిర్ ఖాన్ ను కలిశా. అప్పుడు కాసేపు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత అతని డ్రీమ్ ప్రాజెక్టు 'లాల్ సింగ్ చద్దా'లో నేనూ భాగం అయ్యాను'' అని మెగాస్టార్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. తన ఇంట్లో ఎక్స్‌క్లూజివ్‌ ప్రీమియర్ షో వేసినందుకు థాంక్స్ చెప్పారు. ప్రివ్యూ విజువల్స్ విడుదల చేశారు. కాగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ఆమిర్‌ఖాన్‌ తెరకెక్కించారు. కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, ప్రత్యేక పాత్రలో అక్కినేని నాగ చైతన్య నటించారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.


ఇదీ చూడండి: మెగాస్టార్​ ఇంట్లో 'లాల్​ సింగ్​ చద్ధా' ప్రత్యేక ప్రివ్యూ.. హాజరైన టాలీవుడ్​ ప్రముఖులు

ABOUT THE AUTHOR

...view details