తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

భోళా శంకర్​ ట్రీట్​.. మెగాస్టార్ తాండవం - భోళాశంకర్​ సాంగ్ గ్లింప్స్​

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'భోళాశంకర్‌' సినిమా నుంచి ఓ స్పెషల్​ మోషన్ పోస్టర్ రిలీజైంది. దీని బ్యాక్​ గ్రౌండ్​ మ్యూజిక్​ కూడా అదిరిపోయింది. దాన్ని మీరు చూసేయండి..

Bholashankar song glimpse release
భోళాశంకర్​ ట్రీట్​.. చిరు స్టైల్​ అదిరిపోయింది!

By

Published : Feb 18, 2023, 7:14 PM IST

Updated : Feb 18, 2023, 9:53 PM IST

ఖైదీ నెంబర్‌150తో అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన సైరా నరసింహారెడ్డి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక కొడుకు మెగాపవర్​ స్టార్​ రామ్​చరమ్​తో కలిసి చేసిన ఆచార్య కూడా డిజాస్టర్​గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన గాడ్​ఫాదర్​.. మెగాస్టార్​ రేంజ్​కు తగ్గ సక్సెస్​ను అందుకోలేకపోయింది. అయితే రీసెంట్​గా వచ్చిన వాల్తేరు వీరయ్య మాత్రం.. వింటేజ్​ చిరును గుర్తుచేస్తూ బాక్సాఫీస్​ ముందు అదిరిపోయే బ్లాక్ బస్టర్​ హిట్​ను అందుకుంది. ఏకంగా రూ.200కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. చిరు కెరీర్​లో అదిరిపోయే కలెక్షన్స్​ను అందుకుంది. దీంతో అటు చిరంజీవితో పాటు అటు మెగా అభిమానులు కూడా తెగ సంబరపడిపోయారు. దీంతో ఆయన నుంచి రాబోయే సినిమాపై ఆడియెన్స్​లో ఆసక్తి మొదలైంది. అప్పటివరకు ఎటువంటి బజ్​ లేని భోళాశంకర్​పై హైప్​ క్రియేట్​ అయింది.

'వాల్తేరు వీరయ్య' సక్సెస్​తో ఫుల్​ జోష్​ మీదున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'భోళాశంకర్‌' సినిమా చేస్తున్నారు. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. తమిళంలో సూపర్‌ హిట్​గా నిలిచిన 'వేదాళం' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోంది.

అయితే తాజాగా శివరాత్రి సందర్భంగా స్ట్రీక్​ ఆఫ్ శంకర్​ పేరుతో ఓ మోషన్​ పోస్టర్​ను రిలీజ్​ చేశారు. ఇది చూస్తుంటే ఓ పాటకు సంబంధించిన స్టిల్​ అని అర్థమవుతోంది. ఇందులో చిరు హోలీ రంగుల మధ్యలో చేతిలో ఢమరుకం పట్టుకుని ఓ అదిరిపోయే పోజులో కనిపించారు. డ్రెస్టింగ్​ స్టైల్​, లుక్​ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇందులో చిరు స్ట్రైల్​గా కనిపించారు. బ్యాక్​ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఇకపోతే రీసెంట్​గా కోల్​కతా బ్యాక్​డ్రాప్ భారీ​ సెట్​లో 200మంది డ్యాన్సర్లతో ఓ సాంగ్ షూట్​ చేస్తున్నట్లు తెలిపారు. బహుశ ఆ సాంగ్​ ఇదే అయి ఉండొచ్చు.

కాగా, ఈ సినిమాలో తమన్న హీరోయిన్‌గా నటిస్తోంది. చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేష్‌ కనిపించనుంది. రఘుబాబు, రావు రమేష్‌, మురళీశర్మ, రవిశంకర్‌, వెన్నెల కిశోర్‌, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్‌ శ్రీను, రష్మి గౌతమ్‌, ఉత్తేజ్‌, ప్రభాస్‌ శ్రీను తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్​టైన్మెంట్స్​ బ్యానర్​పై నిర్మాత కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్నారు. ఇకపోతే పాటలకు రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యాం, శ్రీమణి, సిరా శ్రీ లిరిక్స్ అందిస్తున్నారు. శేఖర్‌ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. రామ్‌ లక్ష్మణ్‌ ఫైట్​ మాస్టర్స్​గా వ్యవహరిస్తున్నారు.

ఇదీ చూడండి:గెట్​ రెడీ ఫ్యాన్స్​.. వచ్చే వారమే ఓటీటీలో బిగ్​ స్టార్స్​ మూవీస్​

Last Updated : Feb 18, 2023, 9:53 PM IST

ABOUT THE AUTHOR

...view details