Chiranjeevi BholaSankar Movie: చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ చిత్రం 'భోళా శంకర్'. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్ర కొత్త షెడ్యూల్ జూన్ 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. అన్నాచెల్లెలి అనుబంధాల నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో చిరు చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. ఆయనకు జోడీగా తమన్నా కనిపించనుంది. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి మహతి స్వర సాగర్ బాణీలు అందిస్తున్నారు.
Brahmastra Movie Amitabh Look:'బ్రహ్మాస్త్ర'... బాలీవుడ్ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. సెప్టెంబరు 9న విడుదల కానున్న ఈ చిత్రంలో రణ్‌బీర్‌కపూర్, అలియా భట్ నాయకానాయికలు. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దక్షిణ భారతదేశంలో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి విడుదల చేస్తున్నారు. ఇందులో బిగ్‌బీ అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందులో ఆయన లుక్‌ను కరణ్‌జోహర్ విడుదల చేశారు. గురు పాత్రలో ఆయన ఈ చిత్రంలో గంభీరంగా, శక్తిమంతంగా కనిపిస్తారని పేర్కొన్నారు. నాగార్జున అక్కినేని, మౌనీ రాయ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.