కాంట్రవర్సీలకు కేరాఫ్ అయిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరో సారి వార్తల్లోకెక్కాడు. తాజాగా ఆయనపై పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. శేఖర్ ఆర్ట్ క్రియేషన్ యజమాని కొప్పాడ శేఖర్ రాజు ఫిర్యాదు మేరకు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రామ్గోపాల్ వర్మపై చీటింగ్ కేసు నమోదు - undefined
రామ్గోపాల్ వర్మపై చీటింగ్ కేసు నమోదైంది. 'ఆశ ఎన్‌కౌంటర్' సినిమా నిర్మాణం కోసం తీసుకున్న అప్పు తీర్చకుండా తనను మోసం చేశారని కొప్పాడ శేఖర్ రాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.
రాంగోపాల్ వర్మ సమర్పణలో విడుదలైన చిత్రం 'ఆశ ఎన్‌కౌంటర్'. 2019లో హైదరాబాద్ శివారులో జరిగిన హత్యాచార ఘటన.. నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా నిర్మాణం కోసం తన వద్ద వర్మ డబ్బు తీసుకున్నారని పేర్కొన్నారు. జనవరి 2020లో రూ. 8 లక్షలు, కొన్ని రోజుల తర్వాత మరో రూ. 20 లక్షలు, మరోసారి రూ. 28 లక్షలు తీసుకుని.. సినిమా విడుదలకు ముందే ఈ మొత్తాన్ని ఇస్తానని తనకు హామి ఇచ్చినట్లు ఫిర్యాదులో తెలిపారు శేఖర్. వర్మ చెప్పిన సమయం దాటిపోవడం, పైగా ఆ చిత్రానికి వర్మ నిర్మాత కాదని రాజుకు తెలియడంతో అతను మోసపోయినట్లు గ్రహించానని అందుకే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
ఇదీ చదవండి:'పోకిరి', 'గబ్బర్ సింగ్'లా బాలకృష్ణతో సినిమా: అనిల్ రావిపూడి
TAGGED:
rgv