Bubble Gum Heroine Maanasa Choudhary : టాలీవుడ్లోకి రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. తమ అందం, అభినయంతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా మంచి మంచి ఆఫర్ల కూడా అందుకుంటున్నారు. అయితే ఇందులో వివిధ భాషలకు చెందిన అమ్మాయిలు ఉన్నారు. తెలుగువారు కూడా ఉన్నారు. తాజాగా 'బేబీ' సినిమాతో వైష్ణవి చైతన్య ఫేమస్ అవ్వగా ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి మరో భామ ఎంట్రీ ఇవ్వనుంది.
యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం చేసిన 'బబుల్ గమ్' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది తెలుగమ్మాయి మానస చౌదరి. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌లో ఈ అమ్మడిని చూసిన అభిమానులు తన గురించి నెట్టింట తెగ ఆరా తీస్తున్నారు. అయితే ఈ తెలుగమ్మాయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపింది.
'మాది చిత్తూరు జిల్లాలోని పుత్తూరు అనే ఊరు. నేను అక్కడే పుట్టాను. కానీ పెరిగింది మాత్రం చెన్నైలో. నాకు ఎటువంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. స్టడీస్ పూర్తి చేసుకుని మోడలింగ్‌లోకి అడుగుపెట్టాను. ఆ ఎక్స్‌పీరియన్స్‌తోనే తమిళంలో 'ఎమోజీ' అనే వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేశాను. ఇక అప్పటి నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించాను. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో నా స్నేహితుడి ద్వారా డైరెక్టర్ రవి కాంత్‌కు నా ప్రొఫైల్ పంపాను. ఆయనకు నేను నచ్చడం వల్ల ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. మోడలింగ్‌లో చేసినదాని వల్ల నాలో కెమెరా ఫియర్ ఎక్కడా కలగలేదు. తొలి సినిమా అయినప్పటికీ ఎటువంటి టెన్షన్ లేకుండానే నటించాను. అందుకు మోడలింగ్ ఎంతో తోడ్పడింది. అంటూ తన జర్నీ గురించి చెప్పింది. మరోవైపు ఈ సినిమాలో తన పాత్ర గురించి కూడా ఆమె ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.