తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బోయపాటి-బాలయ్య కాంబోలో మరో మూవీ.. ఫ్యాన్స్​కు పండగే.. అనౌన్స్​మెంట్​ ఎప్పుడంటే!? - balakrishna birthday

అభిమానుల కోసం నటసింహం నందమూరి బాలకృష్ణ.. భారీ ట్రీట్​ రెడీ చేస్తున్నారు!. అదిరిపోయే అనౌన్స్​మెంట్​తో త్వరలో బాలయ్య సందడి చేయబోతున్నారు! ఆ వివరాలు..

balakrishna boyapati
balakrishna boyapati

By

Published : Mar 26, 2023, 9:48 AM IST

అఖండ సినిమా అద్భుత విజయం తర్వాత టాలీవుడ్​ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ.. మంచి జోష్​ మీద ఉన్నారు. ఇటీవలే వీరసింహారెండ్డి చిత్రంతో థియేటర్లలో సందడి చేశారు. ఇప్పుడు హ్యాట్రిక్​ హిట్​ కోసం డైరెక్టర్​ అనిల్​ రావిపూడితో సినిమా తీస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్​ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో నెట్టింట ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఫ్యాన్స్ కోసం బాలయ్య భారీ ట్రీట్​ రెడీ చేస్తున్నారట.

సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆ కాంబోలో మూవీ కోసం ఫ్యాన్స్​ మళ్లీ రావాలని ఎదురుచూస్తుంటారు. అంతే కాదు ఆ కాంబోలో సినిమా వస్తుందంటే వసూళ్ల సునామీ బాక్సాఫీస్​ను ముంచెత్తినట్టే. ఇక టాలీవుడ్​లో అలాంటి కాంబినేషన్ అంటే వెంటనే గుర్తుకువచ్చేది బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబో. వీళ్లిద్దరి కాంబినేషన్​లో ఇప్పటి వరకు తెరకెక్కిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్​గా నిలిచాయి. బాలయ్యకు కెరీర్‌ బెస్ట్‌ కలెక్షన్‌లు తెచ్చిపెట్టిన సినిమాలు కూడా ఇవే.

సింహా, లెజెండ్‌, అఖండ వంటి బ్లాక్‌బస్టర్ల్ హిట్ల తరువాత వీళ్లిద్దరి కాంబినేషన్​లో మరో సినిమాకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు ఈ సినిమాను బాలయ్య తన పుట్టినరోజు సందర్భంగా జూన్‌ 10న.. ఫ్యాన్స్​కు సర్​ప్రైజింగ్ గిఫ్ట్​గా ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బోయపాటి.. హీరో రామ్‌ పోతినేనితో యాక్షన్‌ సినిమా చేస్తున్నారు. అటు బాలయ్య కూడా అనిల్ రావిపూడితో సినిమా షూటింగ్​లో బిజీలో ఉన్నారు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన తరువాత వీరి సినిమాపై ప్రకటన వస్తుందంటున్నారు నెటిజన్లు.

మే నెల కల్లా బోయపాటి-రామ్ సినిమా షూటింగ్ అయిపోతున్నట్టు తెలుస్తోంది. అటువైపు బాలయ్య- అనిల్‌ సినిమా కూడా జూన్ కల్లా షూటింగ్ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉండగానే.. బోయపాటి సినిమా స్టార్ట్ చేస్తారట బాలయ్య. మరి బాలయ్య-బోయపాటి సినిమాకు నిర్మాత ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు.

మైత్రీ మూవీస్​తో బాలయ్య ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి వారికి ఈ బాధ్యతలు అప్పగిస్తారా? లేక బోయపాటికి అత్యంత సన్నిహితుడైన మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మాతగా వ్యవరిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. మరో విషయం ఏంటంటే.. బాలయ్య పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, సితార సంస్థల్లో కూడా సినిమా చేస్తానని సైన్‌ చేశారట. మరి బోయపాటి- బాలయ్య కాంబోను ఏ నిర్మాత తెరకెక్కిస్తారో చూడాలి.

ABOUT THE AUTHOR

...view details