Project k Amitabh : ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న 'ప్రాజెక్ట్-కె' సినిమా.. ఏ భారతీయ చిత్రం అందుకోని ఓ అరుదైన గౌరవాన్ని తాజాగా దక్కించుకుంది. అదే అమెరికాలోని 'శాన్ డియాగో'లో జులై 20 నుంచి 23 వరకు జరగబోయే ప్రముఖ 'కామిక్ కాన్ ఈవెంట్'కు ఎంపిక కావడం. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్ ప్రకటిస్తూ ఓ స్పెషల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీనిపై ఆనందం వ్యక్తం చేశారు హీరో ప్రభాస్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్. అయితే 'ప్రాజెక్ట్-కె' సినిమా గురించి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"'శాన్ డియాగో కామిన్ కాన్ ఈవెంట్'లో పాల్గొనే అవకాశాన్ని ప్రాజెక్ట్-కె దక్కించుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయం. ఈ సినిమాలో నేను నటిస్తున్నప్పటికీ ఇన్ని రోజులు ఈ సినిమా ఇంత గొప్పదని, పెద్దదని.. అమెరికాలో జరిగే అంతటి ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌కు ఎంపిక అవుతుందని అస్సలు అనుకోలేదు. సినిమాలో భాగమైనందుకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నా. ఈ అనుభవాన్ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను."
- అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ స్టార్ హీరో
ఆయనతో స్క్రీన్ షేరింగ్ నాకు గౌరవం..
ప్రాజెక్ట్-కెను నిర్మిస్తున్న ఇటువంటి గొప్ప బ్యానర్లో నేను భాగమైనందుకు.. అలాగే హీరో ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవటం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు అమితాబ్. సెట్స్‌లో ప్రభాస్ నా పట్ల చూపిన ప్రేమ, ఆప్యాయతలు తనను ఎమోషనల్‌గా ఎంతగానో టచ్ చేశాయని తెలిపారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ మొత్తానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గొప్ప ప్రాజెక్ట్‌లో తనను భాగం చేసిన నాగ్ అశ్విన్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.
అప్పుడే టైటిల్, ట్రైలర్..
మరోవైపు ఇంతటి గొప్ప ప్రాజెక్ట్‌కు సంబంధించి టైటిల్, ట్రైలర్ లాంఛ్‌కు ఇంతకు మించిన గొప్ప వేదిక మరొకటి దొరకదంటూ వ్యాఖ్యానించారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇదే ఈవెంట్లో సినిమా టైటిల్‌తో పాటు ట్రైలర్‌ను కూడా లాంఛ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్‌తో పాటు నిర్మాత, హీరో ప్రభాస్, హీరోయిన్ దీపికా పదుకొణె, కోలీవుడ్ లెజెండ్ కమల్ హాసన్ అమెరికాకు వెళ్లనున్నారట.
తొలి ఇండియన్ సినిమాగా..
ఇక అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ ఈవెంట్‌కు హాజరుకానున్న తొలి భారతీయ సినిమాగా 'ప్రాజెక్ట్-కె' రికార్డు సాధించింది. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.