తాను హీరోగా నటించిన 'బింబిసార' సినిమా విజయం ప్రేక్షకులకే దక్కుతుందన్నారు నందమూరి కల్యాణ్ రామ్. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం విడుదలై, మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్ మీట్‌లో పాల్గొని, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. "కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు అధిక సంఖ్యలో వస్తారనేది ఈ సినిమాతో మరోసారి రుజువైంది. చిత్ర పరిశ్రమ మొత్తం వారికి జీవితాంతం రుణపడి ఉంటుంది. తొలి ప్రేక్షకుడిగా ఈ సినిమాని చూసి నా తమ్ముడు మాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచాడు. లవ్ యూ నాన్నా. ఇలాంటి మంచి సినిమాలను మరిన్ని మీ ముందుకు తీసుకొస్తానని మాటిస్తున్నా. సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి, సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు, ఎడిటర్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్.. అద్భుతమైన ఔట్‌పుట్ ఇచ్చిన సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నన్ను నాకంటే బాగా నమ్మి, 'బింబిసార' కథను నాకు అందించినందుకు దర్శకుడు వశిష్ఠకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విజయోత్సాహంలో 'బింబిసార 2'ని మరింత బాధ్యతతో తెరకెక్కిస్తాం" అని అన్నారు కల్యాణ్ రామ్. తమ చిత్రం విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ దర్శకుడు వశిష్ఠ్ ప్రేక్షకులు, నందమూరి అభిమానులు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.
"మరింత బాధ్యతతో 'బింబిసార 2' తెరకెక్కిస్తాం" - బింబిసార 2
సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన 'బింబిసార' చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా 'ఈ విజయోత్సాహంతో బింబిసార-2ను మరింత బాధ్యతగా తెరకెక్కిస్తామని' అన్నారు కల్యాణ్‌రామ్. దర్శకుడు వశిష్ఠకు ధన్యవాాదాలు తెలిపారు.
బింబిసార
త్రిగర్తల సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో కల్యాణ్ రెండు విభిన్న పాత్రలు పోషించారు. సంయుక్త మేనన్, కేథరిన్ కథానాయికలుగా నటించారు. కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన అన్ని సెంటర్లలోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. పలువురు సినీ ప్రముఖులూ సోషల్ మీడియా వేదికగా ఈ చిత్ర బృందాన్ని కొనియాడారు.
ఇదీ చూడండి :'బింబిసార' - 'సీతారామం' ప్రీమియర్ కలెక్షన్స్ ఎంతంటే?