Bhola Shankar Twitter Review : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మిల్క్ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో రూపొందిన లేటెస్ట్ మూవీ 'భోళాశంకర్'. అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో చిరు చెల్లెలిగా కీర్తిసురేశ్ నటించారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన కొందరు అభిమానులు ట్విట్టర్ వేదికగా సినిమా గురించి తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ప్రీమియర్స్ చూసిన కొందరు ఫ్యాన్స్ ఈ సినిమా డీసెంట్ హిట్ అని అంటున్నారు. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఈ సినిమా నచ్చుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఫస్ట్‌హాఫ్ డీసెంట్‌గా ఉందని, సెకండ్ హాఫ్‌లో చిరు కామెడీ టైమింగ్‌తో పాటు కీర్తి సురేశ్- చిరు మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ బాగున్నాయని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. అంతే కాకుండా ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకెండ్ హాఫ్ బాగుందని టాక్.
Chiranjeevi Bhola Shankar Review :ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుందని కొందరు అభిప్రాయపడుతుంటే.. సెకండ్ హాఫ్‌లో వచ్చే చిరంజీవి లోకల్ ఎంట్రీ కూడా సూపర్‌గా ఉందని.. తన ర్యాంపేజ్‌తో చిరు అందరిని ఆకట్టుకున్నారని అంటున్నారు. సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచిందని టాక్. తమన్నా, చిరు మధ్య వచ్చే కామెడీ సీన్స్ కూడా బాగున్నాయని పలువురు అంటున్నారు.