తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

హోటల్​లో యువ నటి సూసైడ్.. పాట రిలీజ్ చేసిన వెంటనే! - భోజ్​పురి హీరోయిన్​ ఆకాంక్ష దుబే తాజా వార్తలు

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ భోజ్​పురి నటి ఆకాంక్ష దుబే ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలోని ఓ హోటల్​ గదిలో ఆదివారం ఉదయం ఆమె ఉరి వేసుకుని బలవన్మరాణానికి పాల్పడ్డారు. దీంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్​కు గురయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు.

Akanksha Dubey Suicide in up latest news
భోజ్​పురి హీరోయిన్​ ఆకాంక్ష దుబే సుసైడ్

By

Published : Mar 26, 2023, 4:33 PM IST

Updated : Mar 26, 2023, 4:43 PM IST

భోజ్​పురి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి ఆకాంక్ష దుబే ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​ వారణాసి సారనాథ్ ప్రాంతంలోని ఓ హోటల్​ గదిలో ఆమె ఉరి వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆకాంక్ష మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్​ మార్టంకు తరలించారు. అతి చిన్న వయస్సులోనే ఆకాంక్ష మృతి చెందడం వల్ల భోజ్​పురి చిత్రపరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

ఆకాంక్ష దుబే బలన్మరణానికి పాల్పడే కొద్ది గంటలముందే అంటే శనివారం రాత్రి భోజ్‌పురి సూపర్‌స్టార్ పవన్​ సింగ్​తో కలిసి చేసిన "యే ఆరా కభీ నహీ హరా" అనే లిరిక్స్​తో ఓ మ్యూజిక్​ వీడిమోను ఆమె తన ఇన్​స్టాగ్రామ్​లో విడుదల చేశారు. ప్రస్తుతం నాయక్ అనే సినిమా షూటింగ్​లో భాగంగా ఆకాంక్ష వారణాసిలో ఉన్నారు. ఇటీవలే వాలెంటైన్స్​ డే సందర్భంగా తన రిలేషన్​షిప్​ గురించి కూడా ఓ కీలక ప్రకటన చేశారు ఈమె. తన కో-యాక్టర్​ సమర్ సింగ్​తో ప్రేమలో ఉన్నానని తెలిపారు. అంతేగాక అతడితో దిగిన ఫొటోలను సోషల్​ మీడియాలో షేర్​ చేశారు.

కో-యాక్టర్​ సమర్ సింగ్​తో రిలేషన్​షిప్​లో ఉన్న ఆకాంక్ష దుబే

ఎప్పుడు చలాకీగా ఉండే ఈ హీరోయిన్​ అకస్మాత్తుగా ఇలా ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇక ఆకాంక్ష మృతికి కూడా ప్రేమ వ్యవహారమే కారణమా అనే అనుమానం వ్యక్తమవుతోంది. అయితే ఈమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇకపోతే ఆకాంక్ష 2018 సంవత్సరంలో తీవ్ర మనోవేదనకు గురైనట్లు సమాచారం. దానివల్ల కొంత కాలం ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారట. ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి తిరిగి వచ్చారు.

మృతికి ముందు ఆకాంక్ష వయస్సు 25 సంవత్సరాలు. ఈమె దుబే 21 అక్టోబర్​ 1997న ఉత్తర్​ప్రదేశ్​లోని మీర్జాపుర్​లో జన్మించారు. చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌, యాక్టింగ్‌ అంటే ఈమెకు ఎంతో ఇష్టం. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో చేసి అప్లోడ్​ చేసే డ్యాన్స్, యాక్టింగ్ వీడియోలతో వైరలయ్యారు ఆకాంక్ష. అంతేగాక ఆకాంక్ష మ్యూజిక్ వీడియోలు తీస్తూ మరింత ఫేమస్​ అయ్యారు. దీంతో ఆమెకు సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి.

కేవలం 17 ఏళ్ల వయసులోనే 'మేరీ జంగ్ మేరా ఫైస్లా' అనే చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఆకాంక్ష. భోజ్‌పురిలో వచ్చిన 'ముజ్​సే షాదీ కరోగి', 'వీరన్ కే వీర్', 'ఫైటర్ కింగ్', 'కసమ్ పైడా కర్నే' 'కేఐ 2' సినిమాలతోనూ ప్రేక్షకులను అలరించారు. కాగా, ఆకాంక్ష ఎప్పుడూ సోషల్​ మీడియాలో చాలా యాక్టివ్​గా ఉంటారు. రెగ్యులర్​గా రీల్స్​ చేస్తూ ఆ విడియోలను ఇన్​స్టాలో పోస్ట్​ చేస్తుంటారు. ఇలా నిత్యం తన ఫ్యాన్స్​తో టచ్​లో ఉండేవారు ఆకాంక్ష. ప్రస్తుతం ఇన్‌స్టాలో ఆకాంక్ష దుబేకి దాదాపు 17 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు.

Last Updated : Mar 26, 2023, 4:43 PM IST

ABOUT THE AUTHOR

...view details