Bhagavanth kesari World wide business : నందమూరి బాలకృష్ణ హీరోగా.. అనిల్ రావిపూడి రూపొందించిన చిత్రం 'భగవంత్ కేసరి'. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది. చిత్ర యూనిట్ విడదల చేసిన ట్రైలర్‌తో అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగానే సినిమాకు సంబంధించి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ నెలకొంది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఓ రేంజ్లో థియేట్రికల్ బిజినెస్ చేసింది.
మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్లు వ్యాపారం జరిగిందని సమాచారం. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి రూ. 59.25 కోట్లు అందుకోగా.. మిగతా భారత దేశం అంతా కలిపి రూ. 4.25 కోట్లు.. ఓవర్సీస్ హక్కులు రూ. 6 కోట్లకు అమ్ముడుపోయాయని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక బిజినెస్ చేసుకున్న చిత్రాల్లో ఇది మూడో స్థానానికి చేరింది. 'వీరసింహారెడ్డి' రూ. 73 కోట్లతో, 'ఎన్.టి.ఆర్' రూ. 70 కోట్లు బిజినెస్‌తో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే, 'భగవంత్ కేసరి' హిట్ అవ్వాలంటే మాత్రం రూ. 68.50 కోట్లు రావాల్సిందేని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో రూ. 57.10 కోట్లకు సినిమా హక్కులు అమ్మడుపోయాయట. ప్రాంతాల వారీగా చూస్తే.. నైజాంలో రూ. 14.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్ల వ్యాపారం జరిగిందని టాక్.