తెలంగాణ

telangana

By

Published : Aug 14, 2023, 7:11 PM IST

ETV Bharat / entertainment

అదీ బాలయ్య వ్యక్తిత్వం.. నటసింహం లేకపోతే అలా అస్సలు జరిగేది కాదట : బాలీవుడ్ నేషనల్​ అవార్డ్​ విన్నర్​​ యాక్టర్​​

Bhagavanth Kesari Villain Arjun Rampal : 'భగవంత్ కేసరి'లో బాలీవుడ్ యాక్టర్​ అర్జున్ రాంపాల్​ విలన్​గా నటిస్తున్న సంగతి తెలిసింది. అయితే తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తైంది. దీంతో ఆయన ఓ స్పెషల్ ట్వీట్ చేశారు. ఆ సంగతులు..

Bhagavanth Kesari Villain Arjun Rampal
భగవంత్ కేసరి విలన్​

Bhagavanth Kesari Villain Arjun Rampal : అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో బ్యాక్​ టు బ్యాక్​ సక్సెస్​లను అందుకుని ఫుల్​ జోష్​ మీదున్నారు గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం భగవంత్ కేసరిలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే రిలీజ్​కు రెడీ అవుతోంది. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్​​ యాక్టర్​ అర్జున్ రాంపాల్ పవర్​ఫుల్​ విలన్​గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయనకు పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తైంది. ఈ విషయాన్ని ఆయన తెలుపుతూ సోషల్​మీడియాలో బాలయ్య, అనిల్​ రావిపూడితో దిగిన ఫొటోలను షేర్​ చేశారు. సినిమాతో అలాగే బాలయ్యతో తనకున్న అనుబంధాన్ని తెలిపారు.

"భగవంత్ కేసరిలో నా పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తైంది. ఇక్కడికి వచ్చినప్పుడు నా తొలి తెలుగు సినిమా కావడం వల్ల కాస్త నెర్వస్​గా ఫీలయ్యాను. ఇప్పుడు కాన్ఫిడెంట్​గా చెప్పగలను ఈ చిత్రం బ్లాస్​ అవుతుంది. నా బిగ్​ బ్రదర్​ బాలయ్య లేకపోతే ఇది అస్సలు సాధ్యమయ్యేదే కాదు. మీ అమేజింగ్ ఎనర్జీ, ప్రేమకు కృతజ్ఞతలు. ఇక నా చిన్న తమ్ముడులాంటి అనిల్ రావిపూడికి కూడా ధన్యవాదాలు. నువ్వు ఎంతో క్రేజీ, కూల్​ అండ్ సూపర్ టాలెంటెడ్​. ఇక ఇక్కడ నా జర్నీ, లైఫ్​ను సాఫీగా సాగేలా చేసిన నా చిన్న తమ్ముడు లాంటి యంగ్ ప్రొడ్యూసర్ సాహూకు కూడా కృతజ్ఞతలు. మొత్తంగా భగవంత్ కేసరి టీమ్​ చూపించిన సహనం, ప్రేమ, మద్దతుకు కృతజ్ఞుతుడిని. మూవీటీమ్​కు బైబై. 19 అక్టోబర్​ 2023 సినిమాలో కలుద్దాం." అని అర్జున్ రాంపాల్ రాసుకొచ్చారు.

Bhagavanth Kesari Villain :అంతకుముందు ఈ సినిమా ప్రారంభంలో ఇక్కడికి వచ్చినప్పుడు అర్జున్​ రాంపాల్​ తెలుగులో బాలయ్య ఫేమస్​ డైలాగ్​ను చెప్పి ఆకట్టుకున్నారు. 'ఫ్లూట్ జింక ముందు ఊదు. సింహం ముందు కాదు'.. అంటూ అన్నారు. అలాగే.. ఈ చిత్రంలో మంచి డైలాగులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. సినిమాలో తనకు ఛాన్స్ ఇచ్చినందుకు బాలయ్యకు స్పెషల్​ థాంక్స్ అంటూ నమస్కారం కూడా పెట్టారు.

Bhagavanth Kesari Release Date: ఇక ఈ భగవంత్ కేసరి చిత్రానికి యంగ్ అండ్ ఫన్​ డైరెక్టర్​ అనిల్​ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో హ్యాట్రిక్​ హిట్​ కొట్టాలని బాలయ్య అభిమానులు ఆశిస్తున్నారు. ఇందులో బాలయ్యకు జోడీగా కాజల్​ అగర్వాల్​ నటిస్తోంది. (balakrishna kajal movie) వీరిద్దరి కలయికలో వస్తున్న మొదటి చిత్రమిది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'లక్ష్మీ కళ్యాణం'తో కాజల్ హీరోయిన్​గా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్​తో కలిసి 'బృందావనం', 'టెంపర్' సినిమాల్లో నటించింది. ఇప్పుడు బాలయ్యతో కలిసి సినిమా చేయడం విశేషం. ఇంకా ఈ భగవంత్ కేసరి సినిమాలో యంగ్ బ్యూటీ సెన్సేషన్​ శ్రీలీల, శరత్​కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్​ కానుంది.

బాలయ్య NBK 108లో విలన్​గా బాలీవుడ్ యాక్టర్​

అదీ బాలయ్య మంచి మనసు అంటే.. ఈ విషయం తెలిస్తే ఎవరైనా జై కొట్టాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details