Bhagavanth Kesari Opening Day Collection :నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'భగవంత్ కేసరి'. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా గురువారం(అక్టోబర్ 19న)గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయింది. యాక్షన్ అండ్ ఎమోషనల్ కంటెంట్‌తో కాజల్ అగర్వాల్, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌ను అందుకుంది. అయితే ఈ మూవీ మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది. ఇంతకీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Bhagavanth Kesari Gross Collection : సినిమా ట్రైలర్‌తోనే మంచి హైప్‌ను క్రియేట్ చేసుకున్న ఈ 'భగవంత్ కేసరి' మొదటి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ.32.33 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టినట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు రూ.65 కోట్ల వరకు జరగవచ్చని సమాచారం. ఈ లెక్కన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టాల్సి ఉంది.
అయితే 'భగవంత్ కేసరి'తో పాటు తమిళ స్టార్ విజయ్ నటించిన 'లియో', మాస్మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రాలు కూడా థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ రెండింటినీ కూడా ఆడియెన్స్ పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీటి పోటిని బాలయ్య చిత్రం తట్టుకొని రూ.130 కోట్ల గ్రాస్‌ను అందుకుంటుందా అనేది వేచి చూడాలి.