తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Bhagavanth Kesari Ganesh Anthem : 'భగవంత్ కేసరి' గణేశ్ సాంగ్ రిలీజ్.. తమన్ బీట్స్​కు బాలయ్య డ్యాన్స్ అదుర్స్.. - భగవంత్ కేసరి పాటలు

Bhagavanth Kesari Ganesh Anthem : నందమూరి నట సింహం బాలకృష్ణ కొత్త సినిమా 'భగవంత్ కేసరి'. మూవీ యునిట్ శుక్రవారం ఈ సినిమా నుంచి పాటను విడుదల చేసింది.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 5:58 PM IST

Updated : Sep 1, 2023, 10:21 PM IST

Bhagavanth Kesari Ganesh Anthem :నందమూరి బాలకృష్ణ కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం 'భగవంత్ కేసరి'. యంగ్ బ్యూటీ శ్రీలీల సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. దర్శకుడు అనిల్ రావిపుడి ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిస్తున్నారు. అయితే శుక్రవారం ఈ సినిమా నుంచి 'గణేశ్ సాంగ్'ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట్లో ట్రెండింగ్​లో ఉంది.

'అఖండ', 'వీర సింహారెడ్డి' బ్లాక్​బస్టర్ హిట్స్ తర్వాత బాలయ్య.. భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టటం పక్కా అని ఫ్యాన్స్​ అంటున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్​కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. తెలంగాణ యాసలో బాలయ్య అదరగొట్టేశారు అంటూ నెటిజన్లు ప్రశంసించారు. ఇక ఈ సినిమాలో స్టార్ నటుడు శరత్ కుమార్ సహా.. బాలీవుడ్ యాక్టర్​ అర్జున్ రాంపాల్​ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాకు సంగీత దర్శకుడు తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రాఫర్​గా సి. రామ్ ప్రసాద్​ వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్ర్రీన్స్​ బ్యానర్​పై.. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 17 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది.

భగవంత్ కేసరి సెట్​లో మోక్షజ్ఞ..
ఇటీవలె బాలయ్య కుమారుడు నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagna).. భగవంత్ కేసరి సెట్స్​లో సందడి చేశారు. షూటింగ్​ స్పాట్​లో సరదాగా గడుపుతూ..దర్శకుడు అనిల్ ​రావిపూడి, నటి శ్రీలీల, కొరియోగ్రాఫర్​ శేఖర్​ మాస్టర్​తో కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ ఫొటోలు రీసెంట్​గా సోషల్​ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఫొటోలు చూసిన నందమూరి ఫ్యాన్స్​.. మోక్షజ్ఞ లుక్ మెస్మరైజింగ్​గా ఉంది, ఓ యంగ్​ హీరోకు ఉండాల్సిన లక్షణాలు అన్ని అతనిలో ఉన్నాయంటూ కామెంట్లు పెట్టారు.

అయితే మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి కొంతకాలంగా చాలా దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. మొదట మాస్ దర్శకుడు బోయపాటి వినిపించగా.. ఆ తర్వాత ఫన్​ డైరెక్టర్​ అనిల్​ రావిపూడి పేర్లు వినిపించాయి. మరి మోక్ష‌జ్ఞ టాలీవుడ్​ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో? ఎవరితో ఉంటుందో అనేది వేచి చూడాలి.

JR NTR Mokshagna : ఎన్​టీఆర్​​ను ఆప్యాయంగా హత్తుకున్న మోక్షజ్ఞ.. ఇప్పుడీ ఫొటోనే సోషల్​మీడియా సెన్సేషన్​..

బాలయ్యలో ఉన్న స్పెషాలిటీ అదే.. ఈ 12 ఆసక్తికర విషయాలు మీకోసం..

Last Updated : Sep 1, 2023, 10:21 PM IST

ABOUT THE AUTHOR

...view details