తెలంగాణ

telangana

By

Published : Dec 14, 2022, 3:20 PM IST

ETV Bharat / entertainment

ఆ థియేటర్​లో 'అవతార్​ 2' ప్రదర్శన.. తనకెంతో సెంటిమెంట్​ అన్న బాలయ్య

అధునాతన హంగులతో 'తారకరామ' థియేటర్​ను పునఃప్రారంభించారు నందమూరి బాలకృష్ణ. ఆ థియేటర్​లో డిసెంబరు 16 నుంచి అవతార్​ 2 సినిమా ప్రదర్శన కానుంది.

balakrishna tarakrama theatre reopened
బాలయ్య 'తారకరామ' థియేటర్​లో 'అవతార్​ 2'..

నగరంలోని ప్రముఖ సినిమాహాళ్లలో ఒకటైన 'తారకరామ' థియేటర్‌ పునఃప్రారంభమైంది. 'ఏషియన్‌ తారకరామ' పేరుతో కొత్త హంగులు సంతరించుకున్న ఈ థియేటర్‌ను బుధవారం సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. "తారక రామ థియేటర్‌కు ఒక చరిత్ర ఉంది. బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి మా తల్లి జ్ఞాపకార్థం కట్టాం. అది మాకొక దేవాలయం. అదే విధంగా ఈ థియేటర్‌ కూడా మాకు దేవాలయంతో సమానం. అమ్మానాన్నల పేర్లు కలిసి వచ్చేలా ఈ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. 1978లో దీన్ని ప్రారంభించాం. 'అక్బర్‌ సలీం అనార్కలి'తో ఇది మొదలైంది. అనివార్య కారణాల వల్ల నిలిచిపోయిన ఈ థియేటర్‌ను తిరిగి 1995లో పునఃప్రారంభించాం. నేటి టెక్నాలజీకి అనుగుణంగా అధునాతన హంగులతో ఇప్పుడు మూడోసారి దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చాం. ఈ థియేటర్‌కు ఒక చరిత్ర ఉంది. 'డాన్‌' సినిమా ఇక్కడ 525 రోజులు ఆడింది. నా సినిమాలు కూడా ఇక్కడ ఘన విజయాన్ని అందుకున్నాయి. ఈ థియేటర్‌ వ్యక్తిగతంగా నాకు సెంటిమెంట్‌. ఎందుకంటే మా అబ్బాయి మోక్షజ్ఞ తారక రామ తేజ నామకరణాన్ని నాన్న ఈ థియేటర్‌లోనే చేశారు. ఏషియన్‌ సినిమాస్‌ సంస్థతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్లతో కలిసి 'ఏషియన్‌ తారకరామ'ను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉంది. మంచి కథలు రావాలి. సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలి" అని బాలయ్య పేర్కొన్నారు.

అధునాతన హంగులతో తారకరామ థియేటర్‌ను తీర్చిదిద్దారు. 4కే ప్రొజెక్షన్‌, సుపీరియర్‌ సౌండ్ సిస్టమ్‌తో పాటు, సీటింగ్‌లోనూ మార్పులు చేశారు. 975 సీటింగ్‌ కెపాసిటీ కలిగిన థియేటర్‌ను ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతి పంచేలా ఉండేందుకు 590కి తగ్గించారు. రెక్లైనర్‌, సోఫాలను అందుబాటులోకి తెచ్చారు. డిసెంబరు 16 నుంచి హాలీవుడ్‌ చిత్రం 'అవతార్‌2'ను ప్రదర్శించనున్నారు.

ఇదీ చూడండి:'నన్ను అవమానించారని తెలిస్తే చిరంజీవి ఊరుకోరు'

ABOUT THE AUTHOR

...view details