తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Balakrishna: ఈ వారం వెండితెర వేల్పులు.. 'గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌' స్పెషల్‌ - బాలకృష్ణ సంక్రాంతి వెండితెర వేల్పులు

వెండితెర వేల్పులు కార్యక్రమంలో ఈ వారం నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ ప్రస్థానం అలరించేందుకు సిద్ధమైంది. ఆ వివరాలు.

Balakrishna Sankranthi special venditera velpulu in etv
Balakrishna: ఈ వారం వెండితెర వేల్పులు.. 'గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌' స్పెషల్‌

By

Published : Jan 13, 2023, 10:18 PM IST

Balakrishna: ఈ వారం వెండితెర వేల్పులు.. 'గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌' స్పెషల్‌

పంచె కట్టినా.. పంచ్‌ కొట్టినా.. ఆయనో ప్రభంజనం.. యాక్షనిజానికి బ్లాస్టర్‌, హీరోయిజానికి మాస్టర్‌ నందమూరి బాలకృష్ణ. తాజాగా 'అఖండ' తర్వాత అదే రేంజ్​లో ఫుల్​జోష్​తో సంక్రాంతి కానుకగా జనవరి 12న 'వీరసింహా రెడ్డి'తో ప్రేక్షకుల్ని పలకరించారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన సినీ జీవిత విశేషాలను ఈ వారం 'వెండితెర వేల్పులు'లో ప్రసారం కానుంది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు తిరిగి సాయంత్రం 6:30 గంటలకు, రాత్రి 10:30 గంటలకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఛానల్‌ల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు.

ఇక వీరసింహారెడ్డి విషయానికొస్తే.. ఈ సినిమా విడుదలతో తెలుగు రాష్ట్రాల్లోని నందమూరి అభిమానులు థియేటర్ల వద్ద ఊరమాస్​ సెలబ్రేషన్స్‌ చేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. థియేటర్ల బయట భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు, టపాసులు కాల్చుతూ, తీన్‌మార్‌ డ్యాన్స్‌లు చేస్తూ హంగామా చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య ఎంట్రీ సీన్స్‌, జై బాలయ్య పాట, పంచ్‌ డైలాగ్‌లు వచ్చినప్పుడు.. కాగితాలు ఎగురవేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఆ వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. బాలయ్య అటు యాక్షన్​తో పాట ఇటు సెంటిమెంట్​ను బ్యాలెన్స్​ చేసి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించినట్లు ఈ వీడియోలు చూస్తే అర్థమవుతోంది.​ ఈ సినిమాలో నటించిన ఇతర తారలు సైతం తమదైన శైలిలో నటించి సీన్స్​ పండించారు.

కలెక్షన్స్​ వివరాల విషయానికొస్తే.. తొలి రోజు రూ.54 కోట్ల గ్రాస్​ వసూలు చేసిందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్​ అధికారికంగా ప్రకటించింది. 'బాలయ్య బాబు బాక్సాఫీస్ ఊచకోత' అని క్యాప్షన్ జోడించింది. కాగా ఇటీవలే రిలీజైన రెండు తమిళ సినిమాల కలెక్షన్లను 'వీరసింహారెడ్డి' అధిగమించిందని సినీ వర్గాల టాక్​. తమిళంలో విజయ్​ 'వారసుడు' రూ.26.5 కోట్లు రాబట్టగా.. అజిత్​ 'తెగింపు' సినిమాకు రూ.26 కోట్ల కలెక్షన్ వచ్చింది.

ఇదీ చూడండి:రౌడీ హీరో కొత్త సినిమా.. ఈ సారి పవర్​ ఫుల్​ పోలీస్​ ఆఫీసర్​గా.. దర్శకుడు ఎవరంటే?

ABOUT THE AUTHOR

...view details