తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

భారీ యాక్షన్​తో ఆ రోజే సెట్స్​పైకి NBK 109 - బాలయ్య పాత్ర ఇలానే ఉండబోతుందట! - balakrishna bobby movie

Balakrishna NBK 109 Movie Shooting Update : NBK 109 షూటింగ్ అప్డేట్​ బయటకు వచ్చింది. తొలి షెడ్యూల్​ను ఆ రోజే మొదలుపెట్టనున్నారట. బాలయ్య పాత్ర కూడా ఎలా ఉండబోతుందో తెలిసింది. ఆ వివరాలు..

NBK 109 భారీ యాక్షన్​తో ఆ రోజే సెట్స్​పైకి - బాలయ్య పాత్ర ఇలానే ఉండబోతుందట
NBK 109 భారీ యాక్షన్​తో ఆ రోజే సెట్స్​పైకి - బాలయ్య పాత్ర ఇలానే ఉండబోతుందట

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2023, 6:39 AM IST

Updated : Nov 4, 2023, 7:24 AM IST

Balakrishna NBK 109 Movie Shooting Update :ఆరు పదుల వయస్సులోనూ అభిమానులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ను అందించడంలో ఏ మాత్రం కాంప్రమైజ్‌ అవ్వట్లేదు నందమూరి నటసింహం బాలకృష్ణ. బ్యాక్​ టు బ్యాక్ చిత్రాలతో కెరీర్​లో దూసుకెళ్తున్నారు. రిసెంట్​గా 'భగవంత్‌ కేసరి' చిత్రంతో దసరా బరిలో దిగి ఘన విజయాన్ని అందుకున్నారాయన. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాల తర్వాత భగవంత్​ కేసరితో హ్యాట్రిక్​ సక్సెస్​ను అందుకుని రికార్డులు సృష్టించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.130కోట్లకు పైగా వసూళ్లను అందుకుని సంచలనం సృష్టించింది.

ఈ జోష్‌లోనే ఇప్పుడాయన తన 109వ చిత్రం కోసం రెడీ అవుతున్నారు. డైరెక్టర్​ బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. సూర్యదేవర నాగవంశీ, ఎస్‌.సాయి సౌజన్య సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం లాంఛ్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా..? అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలానే ఈ ఏడాది వాల్తేరు వీరయ్య చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్న బాబీ.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో బాలకృష్ణను ఎలా చూపించబోతున్నారోనని కూడా ఎదురుచూస్తున్నారు.

Balakrishna Bobby Movie :అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఈ నెల 6వ తేదీ నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్‌ షూటింగ్​ను ప్రారంభించుకోనుందని తెలిసింది. ప్రత్యేకంగా సిద్ధం చేసిన పెద్ద సెట్‌లో ఓ భారీ పోరాట ఘట్టంతో మొదటి షెడ్యూల్‌ ప్రారంభించబోతున్నట్లు సినీ వర్గాలు చెప్పాయి.

1980ల బ్యాక్​డ్రాప్​లో మాస్‌ యాక్షన్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో బాలయ్య మునుపెన్నడూ చేయని శక్తిమంతమైన పాత్రలో.. సరికొత్త లుక్‌తో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. బాలయ్య కోసం ఇప్పటికే బాబీ నాలుగు లుక్​లు డిజైన్​ చేశారని తెలిసింది. ఈ చిత్రం కోసం బాలయ్య తన రెమ్యునరేషన్​ను(Balakrishna Remuneration) కూడా పెంచేశారని, దాదాపు రూ.28కోట్లు ఛార్జ్​ చేయబోతున్నారని బయట కథనాలు వినిపిస్తున్నాయి. ఇకపోతే త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని వెల్లడించనున్నారు.

Balakrishna NBK 109 Remuneration : వరుసగా 3 హిట్లు.. 4 రెట్లు పెంచేసిన బాలయ్య.. బాబీ సినిమా కోసం అన్ని కోట్లా?

Balakrishna Mokshagna : బాలయ్య 2024 మాస్టర్​ 'ప్లాన్'​ రెడీ!.. ఆ మూడు కోరికలు నెరవేరడం పక్కానా?

Last Updated : Nov 4, 2023, 7:24 AM IST

ABOUT THE AUTHOR

...view details