Balakrishna Hanuman Movie :ఈ సంక్రాంతి 2024 విన్నర్ 'హనుమాన్' అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. మహేశ్ గుంటూరు కారం, వెంకటేశ్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ వంటి భారీ చిత్రాలను అధిగమించి మించి మరీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలైన నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్గా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది(Hanuman Collections). ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే ఇప్పుడీ సినిమాను గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ వీక్షించారు. బాలయ్యకు 'హనుమాన్' దర్శకుడు ప్రశాంత్ వర్మకు మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి అన్స్టాపబుల్ సెలబ్రిటీ టాక్ షో కోసం పని చేశారు. ఈ షో ప్రోమోలకు ప్రశాంత్ వర్మే దర్శకత్వం వహించారు.