NBK107 Movie Title: 'అఖండ' సినిమాతో అద్భుత విజయాన్ని అందుకున్న హీరో నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వర్కింగ్ టైటిల్ 'NBK107' పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఎట్టకేలకు ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేశారట మేకర్స్.
అభిమానుల నినాదమైన 'జై బాలయ్య'నే ఈ సినిమాకు టైటిల్‌గా ఫిక్స్ చేశారట. త్వరలోనే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించనుందట. బాలయ్యకు తగినట్లుగా ఎలివేషన్ సీన్లు, పొలిటకల్ పంచులు ఇందులో ఉంటాయట. స్క్రిప్టు కూడా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుందని సమాచారం. దీంతో 'జై బాలయ్య' టైటిల్ సినిమాకు బాగా సెట్ అవుతుందని అదే పేరును ఫిక్స్ చేశారట. అయితే మొదట్లో ఈ సినిమాకు 'అన్నగారు' అనే టైటిల్‌ను అనుకున్నారట. కానీ ఆ పేరును అనిల్ రావిపూడి.. బాలకృష్ణతో తీయనున్న సినిమా కోసం వాడుతున్నారని చిత్రవర్గాల్లో టాక్ నడుస్తోంది.