తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సరికొత్త కాన్సెప్ట్​తో 'హను-మాన్'.. అక్షయ్​ కుమార్​ 'బడేమియా ఛోటేమియా' షూటింగ్ షూరూ? - బడేమియా ఛోటేమియా అక్షయ్​ కుమార్

అక్షయ్​ కుమార్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఆయన నటిస్తున్న మరో మల్టీస్టారర్ త్వరలో సెట్స్​పైకి వెళ్లనుంది. మరో వైపు యువ నటుడు తేజ సజ్జ సరికొత్తగా 'హను-మాన్​'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

bademiya chote miyan and  hanuman movie updates
bademiya chote miyan and hanuman movie updates

By

Published : Nov 8, 2022, 7:25 AM IST

ఇద్దరు యాక్షన్‌ కథానాయకుల్ని ఒకేసారి తెరపై చూస్తే అభిమానులకు పండగే పండగ. అందుకే తమ ఫ్యాన్స్‌ని ఖుషీ చేయడానికి అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌లు కలిసి నటిస్తున్నారు. ఈ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో రానున్న చిత్రం 'బడేమియా ఛోటేమియా'. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుందా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అందుకే చిత్రదర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ కూడా అదే సన్నాహాల్లో ఉన్నారు. ప్రస్తుతానికి పూర్తిస్థాయి స్క్రిప్టుని సిద్ధం చేయడంతో పాటు షూటింగు లోకేషన్లను కూడా ఓకే చేశారట దర్శకుడు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నారు. ఈ సినిమా కోసం 'ది డార్క్‌ నైట్‌' లాంటి చిత్రాలకు పనిచేసిన హాలీవుడ్‌ స్టంట్‌ కోఆర్డినేటర్‌ పాల్‌ జెన్నింగ్స్‌ పనిచేయనున్నారు. ఈ చిత్రంలో జాన్వీకపూర్‌ కథానాయికగా నటించే అవకాశం ఉంది.

సరికొత్తగా 'హను-మాన్'..
తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న సూపర్‌ హీరో చిత్రం 'హను-మాన్‌'. కె.నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. అమృత అయ్యర్‌ కథానాయిక. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, వినయ్‌ రాయ్‌, సత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ నవంబరు 15న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆ పోస్టర్‌లో తేజ సజ్జా ఓ కొండపై నుంచొని శంఖం పూరిస్తున్నట్లుగా కనిపించారు. ఈ సినిమాలో ఆయన ప్రత్యేక శక్తులు కలిగిన సూపర్‌ హీరోగా సందడి చేయనున్నారు. గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యముంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్‌ దేవ్‌, గౌరా హరి, కృష్ణ సౌరభ్‌, ఛాయాగ్రహణం: దాశరధి శివేంద్ర.

ABOUT THE AUTHOR

...view details