తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Baby OTT Release : OTTలోకి కల్ట్ బ్లాక్ బస్టర్.. వామ్మో.. ఒక్కరోజులోనే ఈ రేంజ్​ రెస్పాన్సా? - బేబీ ఓటీటీ మూవీ 100 మిలియన్

Baby OTT Release : చిన్న చిత్రంగా రిలీజై బక్సాఫీస్​ వద్ద సెన్సేషనల్​ సృష్టించిన సినిమా బేబీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 25న ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం.. ఒక్క రోజులోనే మిలియన్స్ వ్యూస్​తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Baby OTT Release
Baby OTT Release : OTTలోకి కల్ట్ బ్లాక్ బస్టర్.. ఒక్కరోజులోనే ఈ రేంజ్​ రెస్పాన్సా?

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2023, 3:35 PM IST

Updated : Aug 26, 2023, 4:18 PM IST

Baby OTT Release : సాయి రాజేశ్ దర్శకత్వంలో వచ్చిన బేబీ మూవీ.. థియేటర్లలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్​ చేసిందో తెలిసిన విషయమే. జులై 14న తేదీన విడుదలైన ఈ సినిమా.. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నాలుగు వారాల పాటు థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా రన్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్​లో వసూళ్లను అందుకుంది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ ఈ చిత్రాన్ని దాదాపూ రూ.5 నుంచి 10 కోట్ల(అంచనా) రూపాయాలతో తెరెకెక్కించారు. అయితే ఈ చిత్రం ఏకంగా రూ.75కోట్లకు పైగా కలెక్షన్లను అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ చిత్రం కల్ట్ క్లాసిక్ హిట్​ స్టేటస్​ను అందుకుంది. యూత్​ ఆడియెన్స్​ అయితే ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అయిపోయారు. సినిమాను ఒకటి కన్నా ఎక్కువ చూసేందుకు ఆసక్తి చూపారు. ఇక ఓటీటీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

Baby OTT Release Telugu : ఈ క్రమంలోనే మూవీటీమ్​.. ఆగస్టు 25 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నట్లు ప్రకటించింది. ఆహా గోల్డ్ సబ్ స్క్రిప్షన్ ఉన్న వారికి 12 గంటల ముందే ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. ఇక వచ్చి రాగానే మళ్లీ థియేటర్ల ఊపును ఓటీటీలోనూ కొనసాగించి దుమ్మురేపుతోంది. ఈ సినిమా ఆహా ఓటీటీలో విడుదలైన 32 గంటలలోనే అత్యంత వేగంగా 100+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ పొందింది. ఈ విషయాన్ని ఆహా నిర్వాహకులు ప్రకటించారు. బేబీ సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ.. బేబీ సినిమా తీన్మార్ మ్రోగింది అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతూ ట్రెండ్ అవుతోంది.

ఇకపోతే ఈ చిత్రంలో ఆనంద్​ దేవరకొండ నటన చూస్తే యాక్టింగ్​లో ఎంతో పరిణితి చెందాడనే అనిపిస్తుంది. భగ్న ప్రేమికుడిగా యూత్​ను ఏడిపించేశాడు. ఆ తర్వాత వైష్ణవి నటన హైలెట్​గా నిలిచింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ చిత్రం.. ప్రస్తుత సమాజంలో ఉన్న ప్రేమ కథలను, యూత్​ ఆలోచనలను దర్శకుడు సాయిరాజేశ్ బాగా చూపించారు. ఫైనల్​గా కంటెంట్​, ఎమోషన్స్​తో కథ బాగుంటే.. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని బేబీ సినిమా నిరూపించింది.

Baby Movie Vaishnavi Chaitanya : బాక్సాఫీస్​ వద్ద అదుర్స్​​.. అయినా 'బేబీ' బ్యూటీకి నో ఆఫర్స్​!.. కారణమేంటో?

August Last Week Movie Release OTT : ఈ వీకెండ్​.. ఓటీటీలోకి 13 క్రేజీ సినిమా/సిరీస్​లు.. బ్లాక్ బస్టర్ ​'బ్రో', 'బేబీ' కూడా

Last Updated : Aug 26, 2023, 4:18 PM IST

ABOUT THE AUTHOR

...view details