తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అల్లు అర్జున్​ లీక్స్​.. 'పుష్ప 2' డైలాగ్​ చెప్పేసిన బన్నీ.. - పుష్ప 2 డైలాగ్ లీక్​

Pushpa 2 Dialogue : ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్‌ తాజాగా బేబీ మూవీ అభినందన సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడ ఆయన అప్​కమింగ్​ మూవీ 'పుష్ప 2'లోని ఓ డైలాగ్‌ని లీక్‌ చేశారు. ఇంతకీ అదేంటంటే..

allu arjun pushpa 2
allu arjun pushpa

By

Published : Jul 21, 2023, 7:37 AM IST

Updated : Jul 21, 2023, 8:43 AM IST

Baby Appreciation Meet : హైదరాబాద్‌లో గురువారం జరిగిన 'బేబీ' మూవీ అభినందన సభకు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరై సందడి చేశారు. సినిమా టీమ్​ను ప్రశంసలతో ముంచెత్తిన బన్నీ.. తన అప్​కమింగ్​ మూవీ 'పుష్ప ద రూల్స్'​లోని ఓ ఐకానిక్​ డైలాగ్​ను చెప్పి అభిమానులకు స్వీట్​ సర్​ప్రైజ్​ ఇచ్చారు. అంతే కాకుండా ఈ సభ వేదికగా ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. తెలుగు చిత్రసీమ ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఓ వెలుగు వెలుగుతోందని చెప్పిన ఆయన.. మంచి వినోదం అందించే విషయంలో ముందు వరుసలో టాలీవుడ్​ ఉందని అన్నారు. ఇంత మంచి పరిశ్రమలోకి వచ్చే విషయంలో అమ్మాయిలు భయపడొద్దని.. ధైర్యంగా ముందుకు రావాలంటూ ప్రోత్సహించారు.

"ప్రేమలో ఉన్న బాధను చూపించే సినిమాలు కొన్నే ఉంటాయి. అలాంటి చిత్రాలు తీయాలంటే చాలా కష్టం. ఎందుకంటే సినిమాలు చూసి లేకుంటే.. స్క్రీన్‌ప్లే పుస్తకాలు చదివి రాస్తే వచ్చేది కాదు. జీవితాన్ని స్వయంగా చూసి.. రాస్తేనే అలాంటి చిత్రాలొస్తాయి. అలాంటి 'బేబీ'ని తీసుకొచ్చిన దర్శకుడు సాయి రాజేష్‌కు కృతజ్ఞతలు. అమీర్‌పేటలో ఆటో కుర్రాళ్లు ఎలా ఫీలవుతారో.. సినిమా చూశాక నేను కూడా అలాగే ఫీలయ్యా. ఆనంద్‌ లేకపోతే ఈ చిత్రం ఇలా వచ్చేది కాదేమో. విరాజ్‌ చాలా క్యూట్‌గా కనిపించాడు. తెలుగులో తెలుగు కథానాయికలు పెద్దగా కనిపించడం లేదేంటన్న ప్రశ్న నన్నెప్పుడూ వేధిస్తుండేది. శ్రీలీల, 'బేబీ'తో వైష్ణవి వచ్చాక తెలుగుమ్మాయిలకు టైం వచ్చిందనిపించింది. ఈ చిత్రంతో వైష్ణవి ఉత్తమ నటిగా అవార్డు అందుకోవాలని ఆశిస్తున్నాను. విజయ్‌ సంగీతం ఈ చిత్రాన్ని అద్భుతంగా ఎలివేట్‌ చేసింది. బాల్‌రెడ్డి ఛాయాగ్రహణం చాలా సహజంగా ఉంది. హీరో అవ్వాలంటే డ్యాన్సులు చేయాలి.. ఫైట్లు చేయాలి అని రూలేం లేదు. ప్రతి ఒక్కరిలోనూ ఓ మ్యాజిక్‌ ఉంటుంది. దాన్ని చూపించే ప్రయత్నం చేయండి చాలు" అని అల్లు అర్జున్​ అన్నారు.

ఆ తర్వాత ఆయన తన అప్​కమింగ్​ మూవీ పుష్ప 2 డైలాగ్​ చెప్పారు. "ఈడంతా జరిగేది ఒకటే రూల్‌ మీద జరుగుతుండాది. పుష్ప గాడి రూలు" అంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఇక ఇదే వేదికగా.. హీరో ఆనంద్‌ దేవరకొండ కూడా మాట్లాడారు. ఈ సినిమా ప్రభావం నుంచి బయటకు రావడానికి ఆయనకు చాలా సమయం పడుతుందని అన్నారు. "ప్రస్తుతం ఇంత వర్షాలు పడుతున్నా.. థియేటర్లు హౌస్‌ఫుల్‌తో నడుస్తున్నాయంటే మా చిత్రాన్ని ఎంత ప్రేమిస్తున్నారో అర్థమవుతోంది. మాకింత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు" అంటూ హీరోయిన్ వైష్ణవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సాయి రాజేష్‌, మారుతి, విరాజ్‌ అశ్విన్‌, ఎస్‌కేఎన్‌, కల్యాణ్ చక్రవర్తి, రేవతి, బాల్‌రెడ్డి, విజయ్‌ బుల్గానిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Last Updated : Jul 21, 2023, 8:43 AM IST

ABOUT THE AUTHOR

...view details