తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కళ్లు చెదిరే విజువల్‌ వండర్స్‌తో 'అవతార్‌-2' కొత్త ట్రైలర్‌.. మీరు చూశారా? - అవతార్​ 2 లేటెస్ట్​ అప్డేట్లు

సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అవతార్‌-2' కొత్త ట్రైలర్​ను మేకర్స్ విడుదల చేశారు. కళ్లు మిరిమిట్లు గొలిపే హంగులతో విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరి ఆ ట్రైలర్​ను మీరు చూశారా? చూడకపోతే ఇప్పుడే చూసేయండి!

Avatar 2 New Trailer:
Avatar 2 New Trailer:

By

Published : Nov 22, 2022, 11:47 AM IST

Avatar 2 New Trailer: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'అవతార్‌-2'. 9ఏళ్ల క్రితం వచ్చిన 'అవతార్‌' చిత్రానికి సీక్వెల్‌ ఇది. జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన ట్రైలర్‌ భారీ అంచనాలు క్రియేట్‌ చేయగా.. తాజాగా మరో కొత్త ట్రైలర్‌ను లాంఛ్​ చేశారు మేకర్స్​.

కళ్లు మిరిమిట్లు గొలిపే హంగులతో, ఆశ్చర్యానికి గురిచేసే విజువల్ ఎఫెక్ట్స్‌తో 'అవతార్‌-ది వే ఆఫ్ వాటర్' ఎలా ఉండబోతుందో ట్రైలర్‌ ద్వారా హింట్‌ ఇచ్చారు డైరెక్టర్‌. ఇప్పటికే ఈ ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో దూసుకుపోతోంది. మరి విడుదలకు ముందే వండర్స్‌ క్రియేట్‌ చేస్తున్న ఈ సినిమా రిలీజ్‌ తర్వాత ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుందో వేచి చూడాలి.

ABOUT THE AUTHOR

...view details