విజువల్ వండర్ 'అవతార్-2' ట్రైలర్ వచ్చేసింది.. - james cameron new movie
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన 'అవతార్-2' ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రం 160 భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
అవతార్
'అవతార్'తో ప్రేక్షకుల్ని పాండోరా గ్రహంలో విహరింపజేసిన జేమ్స్ కామెరూన్.. ఇప్పుడు 'అవతార్ 2'తో మరో సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రపంచ సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్ర టీజర్ ట్రైలర్ వచ్చేసింది. ఇటీవల విడుదలైన 'డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్' సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్స్‌లో ఈ టీజర్ ట్రైలర్‌ను విడుదల చేయగా, ఇప్పుడు జేమ్స్ కామెరూన్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
Last Updated : May 9, 2022, 10:56 PM IST