తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సచిన్​ను కలిసిన ఏఆర్​ రెహ్మాన్.. మ్యాటర్​ ఏంటంటే?​ - సచిన్ తెందుల్కర్​ ఏఆర్​ రెహ్మాన్​ ఫొటో వైరల్​

దిగ్గజ క్రికెటర్​ సచిన్ తెందుల్కర్​ను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్​ ఏఆర్ రెహ్మాన్​ కలిశారు. ఎందుకంటే?

AR Rahman meets Sachin tendulkar
సచిన్​ను కలిసిన ఏఆర్​ రెహ్మాన్

By

Published : Oct 17, 2022, 10:51 PM IST

క్రికెటర్లు, సినీ తారల మధ్య ఉన్న స్నేహబంధం గురించి తెలిసిందే. ఎప్పటి నుంచో క్రికెట్, సినీ రంగాల మధ్య బలమైన అనుబంధం ఉంది. తాజాగా అందుకు సాక్ష్యంగా దిగ్గజ క్రికెటర్​ సచిన్ తెందుల్కర్​, ఏఆర్ రెహ్మాన్ నిలిచారు. ఈ విషయాన్ని గాడ్ ఆఫ్ మ్యూజిక్ ఏఆర్ రెహ్మాన్ సోషల్​మీడియాలో ట్వీట్​ చేశారు.

సచిన్, రెహ్మాన్ మధ్య స్నేహబంధం చాలా కాలంగా కొనసాగుతోంది. అప్పుడప్పుడు వేడుకల్లో, పార్టీలలో కలుసుకుంటూనే ఉంటారు. అయితే వీరిద్దరు మరోసారి కలుసుకుని ఫ్యాన్స్​లో జోష్​ను నింపారు. 'మాస్టర్ బ్లాస్టర్‌తో కలిసి కొంత సమయాన్ని గడిపాను' అంటూ వారిద్దరు కలిసిన ఫోటోను షేర్ చేశారు రెహ్మాన్​. వారిద్దరూ బాంద్రాలోని ఎంసీఏ క్లబ్‌లో కలిసినట్టు హ్యాష్ ట్యాగ్ ద్వారా వెల్లడించారు. సచిన్ తెందుల్కర్‌కు కూడా ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్​ అవుతోంది.

ఇక ఏఆర్ రెహ్మాన్ ట్వీట్‌కు స్పందిస్తూ.. 'సంగీత సునామీ ఏఆర్ రెహ్మాన్‌తో సండే అద్భుతంగా గడిచిపోయింది' అని సచిన్ తెందుల్కర్ బదులిచ్చారు. కాగా, గతంలో సచిన్ బయోపిక్‌గా వచ్చిన సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్ అనే చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. ఈ చిత్రం 2017లో ఏప్రిల్ 26వ తేదీన విడుదలైంది.

ఇదీ చూడండి: హాట్​ హాట్ భామలు అదిరిపోయే అందాలు చూస్తే కిక్కే కిక్కు

ABOUT THE AUTHOR

...view details