AR murugadoss sivakarthikeyan : గతంలో వరుస చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లను అందుకున్న దర్శకుడు ఏఆర్ మురుగదాస్. 'గజని', 'తుపాకీ', 'సర్కార్' వంటి విజయవంతమైన చిత్రాలతో తమిళంతో పాటు తెలుగు వారినీ బాగా ఆకట్టుకున్నారు. అయితే తెలుగు వారికి మాత్రం గట్టి ఫ్లాప్లే ఇచ్చారు! అప్పట్లో ఆయన తెలుగులో మెగాస్టార్ చిరంజీవి తెరకెక్కించినా 'స్టాలిన్' పర్వాలేదనిపించింది. కానీ మహేశ్ బాబు 'స్పైడర్' చిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచిపోయింది. సరే ఏదేమైనప్పటికీ.. ఎంత గొప్ప డైరెక్టరే అయినా అప్పుడప్పుడు ఫ్లాప్లనేవి సహజం. అయితే ఇప్పుడాయనకు ఆ డిజస్టర్లు వరుసగా పలకరిస్తున్నాయి.
చివరగా ఆయన దర్శకత్వం వహించినా రజనీకాంత్ 'దర్బార్' కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. దీంతో ఆయన దర్శకత్వానికి కాస్త గ్యాప్ ఇచ్చి.. నిర్మాతగా మారి '1947 ఆగస్టు 16' నిర్మించారు. అలానే సీనియర్ హీరోయిన్ త్రిష టైటిల్ రోల్ రూపొందిన 'రంగీ'కి కథ అందించారు. అయితే ఈ రెండు కూడా బోల్తా కొట్టాయి.
Mrunal thakur upcoming tamil movie : అలా మూడేళ్ల నుంచి ఒక్క సినిమాకు కూడా దర్శకత్వం వహించని ఆయన.. ఇప్పుడు ఎట్టకేలకు ఓ హీరోతో కలిసి సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయనే కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్. డాన్, డాక్టర్ సహా తదితర చిత్రాల హిట్లతో ప్రస్తుతం ఈ హీరోకు మార్కెట్ కూడా బాగానే ఉంది. ఈయనతోనే మురగదాస్ ఓ పాన్ ఇండియా సినిమా చేసేందుకు రెడీ అయ్యారని చెన్నైలో టాక్ వినిపిస్తోంది. హీరోయిన్గా సీతారామం, లస్ట్ స్టోరీస్ 2 బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు పరిశీలనలో ఉందని తెలిసింది. తాజాగా టెస్ట్ షూట్ కూడా చేశారట. దాదాపుగా ఆమె ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇక అనిరుధ్ రవిచందర్‌ను మ్యాజిక్ డైరెక్టర్‌గా తీసుకుంటున్నారట. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఓ డిఫరెంట్ పాయింట్‌తో చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.