ANUDEEP VENKATESH MOVIE 'జాతిరత్నాలు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు అనుదీప్ కేవీ. ఈ దర్శకుడు ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్‌తో ఓ సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే వెంకటేశ్‌కు ఇంకా కథ వినిపించలేదని.. త్వరలో వినిపిస్తానని అనుదీప్ కేవీ అన్నట్లు సమాచారం. వెంకీ ఈ కథకు ఓకే చెబితే త్వరలోనే క్రేజీ కామెడీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది.
అనుదీప్ తాజాగా తెరకెక్కించిన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా సెప్టెంబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ రెడ్డి, సంచితా బసు జోడిగా నటించారు. అనుదీప్ దర్శకత్వంలో తమిళ కథానాయకుడు శివకార్తికేయన్ కాంబోలో తెరకెక్కిన 'ప్రిన్స్' మరికొన్ని నెలల్లో విడుదల కానుంది. 'ఎఫ్3'తో నవ్వించిన వెంకటేష్.. తన కొత్త సినిమాని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. కొంతకాలంగా కథల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన, ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌తో కలిసి హిందీ చిత్రం 'కభీ ఈద్ కభీ దివాలి' చేస్తున్నారు. మరి సోలోగా వెంకీ చేయనున్న కొత్త చిత్రం ఏమిటనేది మాత్రం ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.
sita ramam collection: ఇటీవల విడుదలైన ప్రేమకథా చిత్రం 'సీతారామం' భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్, రష్మిక మంధాన ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సీతారామం సాలిడ్ హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.75 కోట్లకుపైగా గ్రాస్ సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తెలిపింది.