తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అంటే సుందరానికీ.. కడుపుబ్బా నవ్వించి, కన్నీళ్లు పెట్టించే సినిమా'

Ante Sundaraniki: 'అంటే.. సుందరానికీ!'.. కడుపుబ్బా నవ్వించి, కన్నీళ్లు పెట్టించే సినిమా అన్నారు దర్శకుడు హరీశ్ శంకర్​. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్​ ఈవెంట్​ జరిగింది.

ante sundaraniki movie pre release event
అంటే సుందరానికి

By

Published : Jun 9, 2022, 10:45 PM IST

Ante Sundaraniki: నాని, నజ్రియా జంటగా తెరకెక్కిన చిత్రం 'అంటే.. సుందరానికీ!'. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం పవన్‌కల్యాణ్‌ ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహిచింది. ఈ వేడుకలో దర్శకులు సుకుమార్‌, హరీశ్‌ శంకర్‌, గోపీచంద్‌ మలినేని, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.

సుకుమార్​

ప్రీరిలీజ్​ వేడుకనుద్దేశించి సుకుమార్‌ మాట్లాడుతూ.. "ఈ చిత్రాన్ని నేను చూశా. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం అద్భుతంగా ఉంది. నాని ఓ నటనాకాశం. సహజ నటుడాయన. నాని, నజ్రియా జంట చూడ ముచ్చటగా ఉంది. ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా" అని సుకుమార్‌ అన్నారు.

హరీశ్​ శంకర్

మళ్లీ మళ్లీ చూసేలా: హరీశ్‌శంకర్‌

"చిత్ర పరిశ్రమంతా ఒకటే కుటుంబమని పవన్‌ ఎప్పుడూ చెప్తుంటారు. అందుకే ఆయన ఈ రోజు ఈ వేడుకకు వచ్చారు. మా కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమైనా సరే మీరు మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుంది. పదేళ్లపాటు మాట్లాడుకునేలా చేస్తుంది. 'అంటే.. సుందరానికీ!'.. కడుపుబ్బా నవ్వించి, కన్నీళ్లు పెట్టించే సినిమా. వివేక్‌ ఆత్రేయ డైరెక్షన్‌ ఆలోచింపజేసింది. నాని పేరు మర్చిపోయి ఆయన పోషించిన సుందర్‌ పాత్రనే గుర్తుపెట్టుకున్నా" అని హరీశ్‌శంకర్‌ పేర్కొన్నారు.

పవన్‌ చెప్పిన మాటను మర్చిపోలేను: బుచ్చిబాబు

బుచ్చిబాబు

"'ఉప్పెన' సినిమా సమయంలో పవన్‌ కల్యాణ్‌ సర్‌ని కలిశా. ఇలాంటి మట్టి కథలు రావాలని ఆయన చెప్పిన మాటను ఎప్పటికీ మర్చిపోలేను. రెండు రోజుల క్రితం 'అంటే.. సుందరానికీ!' సినిమాని చూశా. నాని, నజ్రియా నటనతో కట్టిపడేశారు. ఈ చిత్రం మంచి విజయం అందుకోవాలి" అని బుచ్చిబాబు ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:'ఎన్​బీకే107' టీజర్​లో బాలయ్య గర్జన​.. మాస్​ డైలాగులతో ఫ్యాన్స్​కు పూనకాలు!

ABOUT THE AUTHOR

...view details