తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అంజలి స్పెషల్​ సాంగ్​.. నితిన్​తో చిందులు.. 'కార్తికేయ 2' వాయిదా!​ - ma nanna naxalite teaser

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో నితిన్​ 'మాచర్ల నియోజకవర్గం', నిఖిల్​ 'కార్తికేయ 2', సంగీత దర్శకుడు రఘు కుంచె ప్రధాన పాత్రలో నటించిన 'మా నాన్న నక్సలైట్' చిత్రాల సంగతులు ఉన్నాయి.

anjali Nithin Macharla niyojakavargam
నితిన్​తో అంజలి చిందులు

By

Published : Jul 3, 2022, 1:12 PM IST

Nithin Macharla niyojakavargam: నితిన్‌ కథానాయకుడిగా... ఎం.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. కృతిశెట్టి, కేథరిన్‌ కథానాయికలు. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పకులు. చివరి పాట మినహా చిత్రీకరణ పూర్తయినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఆగస్ట్‌ 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ప్ర‌త్యేక‌గీతంలో హీరోయిన్ అంజ‌లి చిందేయనున్నట్లు చిత్రయూనిట్ ప్ర‌క‌టించింది. ఆమె పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్​లో హాట్ లుక్‌లో అంజ‌లి క‌నిపిస్తోంది. హైదరాబాద్​లో వేసిన భారీ సెట్​లో ఈ స్పెషల్​ సాంగ్​ను షూట్ చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక గీతం సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ పాటకు సంబంధించిన అనౌన్స్​మెంట్​ను సోమవారం తెలుపనున్నారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సిద్ధార్థ అనే ఐఏఎస్ అధికారి పాత్ర‌లో నితిన్ క‌నిపించ‌బోతున్నారు. రాజ‌కీయ కుట్ర‌ల‌పై ఓ క‌లెక్ట‌ర్ ఎలాంటి పోరాటం సాగించాడ‌నే పాయింట్‌తో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రసాద్‌ మూరెళ్ల- ఛాయాగ్రహణం, మహతి స్వరసాగర్‌- సంగీతం, మామిడాల తిరుపతి-సంభాషణలు, సాహి సురేష్‌-కళ, కోటగిరి వెంకటేశ్వరరావు-కూర్పు అందిస్తున్నారు.

అంజలి

Nikhil Karthikeya 2 postpone: సినీ ప్రియులంతా ఆసక్తి ఎదురుచూస్తున్న సినిమాల్లో 'కార్తికేయ 2' ఒకటి. నిఖిల్‌ కథానాయకుడిగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జులై 22న విడుదలకానుంది. అయితే ఇప్పుడీ సినిమా విడుదల తేదిని వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు రిలీజ్​ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. కాగా, ఇటీవలే విడుదలైన ఈ చిత్ర మోషన్​ పోస్టర్​, ట్రైలర్​.. ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేశాయి. సముద్రం దాచుకున్న ద్వారకా నగరం.. దాని వెనకున్న రహస్యాన్ని కనిపెట్టే కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్టు ప్రచార చిత్రం ద్వారా అర్థమైంది. "అసలు కృష్ణుడు ఏంటి?ఈ కథను ఆయనే నడిపించటం ఏంటి?" అంటూ నిఖిల్‌.. "విశ్వం ఒక పూసల దండ. ప్రతిదీ నీకు సంబంధమే. ప్రతిదీ నీ మీద ప్రభావమే" అంటూ అనుపమ్‌ ఖేర్‌ చెబుతున్న సంభాషణలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. నిఖిల్‌- చందూ కాంబినేషన్‌లో 2014లో వచ్చిన 'కార్తికేయ' మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి ఫ్రాంచైజీగా రూపొందుతుండటంతో 'కార్తికేయ 2'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నిఖిల్‌ సరసన అనుపమ పరమేశ్వరన్‌ కనిపించనుంది. అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకాబోతోంది.

Music Director Raghu Kunche movie teaser: ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మా నాన్న నక్సలైట్'. పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో చదలవాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మా నాన్న నక్సలైట్ టీజర్​ను విడుదల చేసింది. కొండరుద్ర సీతారామయ్య అనే పాత్రలో రఘు కుంచె కనిపించనుండగా హోంమంత్రి పాత్రలో సుబ్బరాజు, ఎస్పీ భరత్​గా అజయ్ నటించారు. పోలీసులు- నక్సలైట్లకు మధ్య జరిగిన ఘర్షణలో సీతారామయ్య అనే వ్యక్తి ఎందుకు నక్సలైట్ గా మారాల్సి వచ్చిందనే కథాంశంతో సునీల్ కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఇదీ చూడండి: నరేశ్​-పవిత్రతో తగాదా పడిన రమ్య.. చెప్పుతో కొట్టేందుకు యత్నం!

ABOUT THE AUTHOR

...view details