తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'బుట్ట బొమ్మ' ట్రైలర్​ వచ్చేసిందిగా.. అతడి నుంచి అనిఖా తప్పించుకుందా? - బుట్టబొమ్మ లేటెస్ట్ అప్డేట్స్

బాల నటి అనిఖా సురేంద్రన్​ హీరోయిన్​గా నటించిన తొలి చిత్రం 'బుట్టబొమ్మ'. ఇప్పటికే వచ్చిన టీజర్​ పోస్టర్​తో ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజైంది. మీరు చూసేయండి..

butta bomma trailer
butta bomma trailer

By

Published : Jan 28, 2023, 12:54 PM IST

2022లో వచ్చిన 'ది ఘోస్ట్‌' చిత్రంలో నాగార్జునకు మేనకోడలిగా మెరిసిన బాల నటి అనిఖా సురేంద్రన్‌ ఇప్పుడు 'బుట్టబొమ్మ'తో హీరోయిన్​గా తెరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రంలో సూర్య వశిష్ఠ సరసన నటించింది. ఇప్పటికే వచ్చిన టీజర్​కు మంచి రెస్పాన్స్ రాగా శనివారం మూవీకి సంబంధించిన ట్రైలర్​ రిలీజయ్యింది.

ఫోనులో పరిచయమైన ఓ అబ్బాయితో మాట్లాడే అనిఖా ఆ తర్వాత అతనితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి తిరగడాన్ని చూసిన అర్జున్​ దాస్​ వారి వెంట పడతాడు. అతని నుంచి తప్పించుకోవాలని ఇంటి నుంచి పారిపోయిన వారిద్దరికి ఏమైందనే కోణంలో ట్రైలర్ ఆద్యంతం కొన​సాగింది. ఇక సినిమా విషయానికొస్తే శౌరి చంద్రశేఖర్‌ రమేష్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో అనిఖాతో పాటు అర్జున్‌ దాస్‌, సూర్యవశిష్ఠ కీలక పాత్రలు పోషించారు. షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 26న విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details