Anand Deverakonda Vaishnavi Movie :టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, నటి వైష్ణవీ చైతన్య జంటగా నటించిన చిత్రం 'బేబీ'.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ జోడీకి సైతం ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ సక్సెఫుల్ జోడీ మరోసారి తెరపై మెరవబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు ఓ సినిమా పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది.
'3 రోజెస్' వెబ్‌సిరీస్‌కు రచయితగా, 'ప్రతిరోజూ పండగే' సినిమాకు కో రైటర్, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన రవి నంబూరి.. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. కాగా, ఈ సినిమాకు బేబీ డైరెక్టర్ సాయి రాజేశ్.. కథ అందించారు. ఈ విషయాన్ని దర్శకుడు సాయి రాజేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 'కల్ట్ కాంబో ఈజ్ బ్యాక్. చిత్రానికి కథ రాసింది నేనే. నా మిత్రుడు రవి నంబూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు' అని రాసుకొచ్చారు. ఈ సినిమాను 'బేబీ' నిర్మాత ఎస్‌కేఎన్‌తో కలిసి సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. ఇక సినిమాను 2024 సమ్మర్లో విడుదల చేయనున్నట్లు మూవీయూనిట్ తెలిపింది.