ప్రస్తుతం పుష్ప సూపర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే.. తదుపరి సినిమాల కోసం సిద్ధమవుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. గంగోత్రితో సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఆయన సినిమా సినిమాకు నటనలో వైవిధ్యం చూపిస్తూ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. అయితే ఇన్నేళ్ల తన జర్నీలో బన్నీ ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించాడని మీకు తెలుసా? అది కూడా సుకుమార్ దర్శకత్వంలోనే. సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఐ యామ్ దట్ చేంజ్ అనే టైటిల్‌తో ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది. సామాజిక అంశంతో రూపొందిన ఈ లఘుచిత్రానికి బన్ని నిర్మాతగా కూడా వ్యవహరించారట. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ లఘు చిత్రంలో "మన బాధ్యతను మనం నిర్వర్తించడం కూడా దేశభక్తే. మార్పు మనతోనే మొదలవుతుంది. ఆ మార్పు నేనే" అంటూ బన్నీ చెప్పారు. ఓ సారి ఆ వీడియోను మీరూ చూసేయండి..
షార్ట్‌ఫిల్మ్‌లో అల్లుఅర్జున్.. దర్శకుడిగా సుకుమార్ - అల్లుఅర్జున్ పుష్ప మూవీ
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్.. దర్శకుడు సుకుమార్ కాంబినేషనలో ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కింది. మీరు చూడకపోయి ఉంటే ఓ సారి చూసేయండి..
కాగా, ఇటీవలే ఘనంగా జరిగిన సైమా అవార్డ్స్‌లో పుష్ప సినిమా అదరగొట్టింది. గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా సైమా అవార్డుల్లోనూ సత్తా చాటింది. మొత్తం 12 కేటగిరీల్లో నామినేషన్లు దక్కించుకోగా, ఆరింటిలో అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ గేయ రచయిత విభాగాల్లో ఈ చిత్రానికి అవార్డులు దక్కాయి.
ఇదీ చూడండి: లాకప్‌లో నటుడు.. పదిరోజులు తిండి తినకుండా నీటితోనే..