'ఊర్వశివో రాక్షసివో' తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు నటుడు అల్లు శిరీష్. అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమా ప్రచారచిత్రాలు యువతను ఆకట్టుకున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు.. ఈ జంట ప్రేమలో ఉందని మాట్లాడుకుంటున్నారు. దీనిపై తాజాగా శిరీష్ స్పందించారు.
"నటీనటుల జీవితాల్లో ఇలాంటి వదంతులు సర్వసాధారణం. కోస్టార్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు రావడం సహజం. గతంలోనూ నా గురించి ఇలాంటి వార్తలే వచ్చాయి. నిజం చెప్పాలంటే మా మధ్య అలాంటిది ఏమీ లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం. కొన్ని నెలలపాటు కలిసి పనిచేశాం కాబట్టి మా మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అదీ కాక.. తను చాలా సైలెంట్. మా ఇద్దరి వ్యక్తిత్వాలు ఒకేలా ఉంటాయి. సంగీతం, పుస్తకాలు, సినిమాలు.. ఇలా ఎన్నో విషయాల్లో మా అభిరుచులు కలిశాయి. దానివల్ల మేమిద్దరం ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం ఏర్పడింది. వర్క్ విషయంలో తను ప్రొఫెషనల్‌గా ఉంటుంది. అందువల్లే రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు ఇబ్బందిపడలేదు.