Allu Arjun Statue : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'పుష్ప పార్ట్-1' చిత్రం బన్నీకి వరల్డ్‌వైడ్‌గా ఫ్యాన్స్‌ను సంపాదించి పెట్టింది. కాగా, ఇటీవలే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. లండన్‌లోని ప్రతిష్టాత్మక 'మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం'లో అతడి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అఫిషీయల్ అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ.. ప్రస్తుతం ఈ వార్తను బన్నీ అభిమానులు తెగ షేర్ చేసేస్తున్నారు.
ఈ విగ్రహాన్ని తయారుచేసేందుకు కావాల్సిన కొలతలను ఇచ్చేందుకు బన్నీ ఇప్పటికే లండన్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఇది వాస్తవమైతే ఈ ఘనత సాధించిన మూడో దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ నిలుస్తాడు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన డార్లింగ్ ప్రభాస్, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మైనపు విగ్రహాలను మేడమ్ టుస్సాడ్స్‌లో మ్యూజియంలో ఏర్పాటు చేశారు.
ఆ సినిమా కోసమే వెయ్యి కళ్లతో వెయిటింగ్!
Allu Arjun Pushpa 2 Movie : ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్‌తో కలిసి 'పుష్ప: ది రూల్'లో నటిస్తున్నాడు. ఇది 'పుష్ప: ది రైజ్'కి సీక్వెల్. వీరిద్దరి కాంబినేషన్లో ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిందో తెలిసిందే.
Ormax Media Latest Survey : ఇదిలా ఉండగా.. తాజాగా ఓర్మాక్స్ మీడియా అనే సంస్థ బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల గురించి ఓ సర్వే నిర్వహించింది. కాగా, ఇందులో 'పుష్ప-2' టాప్ 1లో నిలిచింది. ఈ సినిమా కోసమే చాలా మంది ఎదురుచూస్తున్నట్లు తెలిపారట. దీనితో ఈ సీక్వెల్ కోసం మూవీ లవర్స్ ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థమవుతోంది. ఇక ఈ సర్వేలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న 'టైగర్3' మూడో ప్లేస్‌లో ఉండగా.. షారుక్ ఖాన్ 'డుంకీ' ఐదో స్థానంలో ఉంది.
షార్ట్ అండ్ స్వీట్ ఇంటర్వ్యూ!
ఇటీవలే ప్రముఖ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌కు షార్ట్ అండ్ స్వీట్ ఇంటర్వ్యూ ఇచ్చారు బన్నీ. ఇందులో తన దినచర్య ఎలా ప్రారంభమవుతుంది, కుటంబమంటే తనకెంత ప్రేమ అన్న విషయాలతో పాటు దర్శకుడు సుకుమార్, అభిమానులతో తనకున్న అనుబంధం గురించి ఈ వీడియోలో పంచుకున్నారు. పుష్ప-2 కాస్ట్యూమ్స్, తన మేకప్ ప్రాసెస్‌తో పాటు సెట్లో షూటింగ్ మేకింగ్ వీడియోను కూడా చూపించారు. కాగా, చివర్లో పుష్ప-2 చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని.. అందరూ తప్పకుండా మళ్లీ ఆదరిస్తారని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.