Allu Arjun National Award :టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కుమారుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో వెండితెరపై హీరోగా పరిచయమై.. పుష్ప సినిమాతో నేడు పాన్ఇండియా స్టార్‌గా ఎదిగారాయన. సుమారు 20 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను అధిగమించారు అల్లు అర్జున్. ప్రతి సినిమాకు తనలోని కొత్తదనాన్ని పరిచయం చేస్తూ.. ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్‌గా పేరొందారు. అలా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ.. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించారు.
ఇక పుష్ప సినిమాతో తగ్గేదెలేఅంటూ ఒక ట్రెండ్‌ను సెట్ చేయడంలో బన్నీ సక్సెస్ అయ్యారు. ఈ సినిమాలో తన మేనరిజం దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. ఆయా సందర్భాల్లో ప్రముఖ నటులు, క్రికెటర్లు తన మేనరిజాన్ని ఫాలో అయ్యారు. కాగా ఈ సినిమాలో బన్నీ నటనకుగాను కేంద్రం ఉత్తమ నటుడి అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. కాగా 69 ఏళ్లలో తెలుగు హీరోకు ఉత్తమ నటుడి అవార్డు దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. పుష్ప పాత్రతో పాటు తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే మరి కొన్ని క్యారెక్టర్లు ఎంటో చూద్దాం.
1. పష్పరాజ్..
బన్నీ కెరీర్లో ఎవర్గ్రీన్ పాత్రల్లో పుష్పరాజ్ ఒకటి. ఈ పాత్రలో అల్లు అర్జున్ నటనకు యావత్ దేశం ఫిదా అయ్యింది. ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించడం కోసం ఆయన.. రెండు గంటలపాటు కదలకుండా మేకప్ వేసుకున్నారని ఆ మధ్య డైరెక్టర్ సుకుమార్ ఓ సందర్భంలో చెప్పారు. కాగా ఈ పాత్రలోని నటనకే తాజాగా నేషనల్ అవార్డు లభించింది.