కమెడియన్ ఆలీ షూటింగ్ సెట్లో ఉన్నప్పుడు తనకు సైట్ కొట్టేవాడని అన్నారు సీనియర్ నటి తులసి. ఆలీతో సరదాగా కార్యక్రమానికి ప్రభాస్ శ్రీనుతో కలిసి విచ్చేసిన ఆమె ఈ విషయాన్ని చెప్పారు. 'నాలుగు స్తంభాలాట' సినిమాలో ఆలీ- తులసి నటించారు. అప్పుడు 'మీ ఇద్దరికీ ఎలా పరిచయం?' అని ప్రభాస్ శ్రీను అడగగా... తనకు సైట్ కొట్టేవాడని తులసి చెప్పుకొచ్చారు.
ఒక్క ప్రెస్మీట్ స్పీచ్తో..ఛాన్సులే ఛాన్సులు.. 'కార్తికేయ 2' సినిమాలో తల్లి పాత్రలో తులసి నటించారు. అది పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడంతో ఆమె పాన్ ఇండియా మదర్ అయిపోయారని ఆలీ వ్యాఖ్యానించారు. మధ్యలో అందుకున్న 'ప్రభాస్' శ్రీను... "అన్నా ఆ సినిమా ప్రెస్మీట్లో అద్భుతంగా మాట్లాడారు. పిచ్చెక్కిపోయింది" అన్నారు. వెంటనే తులసి "సినిమా ఒక ఎత్తు అయితే... ఆ స్పీచ్ వల్ల నాకు ఎన్ని సినిమాలు వచ్చాయంటే, ఏమని చెప్పాలి" అన్నారు. ఒక్క స్పీచ్ చాలా ఛాన్సులు వచ్చాయని పేర్కొన్నారు.