తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

14 ఏళ్ల తర్వాత తెరపైకి విజయ్​-త్రిష జంట.. ఫిల్మ్​సిటీలో షూటింగ్ షురూ.. - దళపతి 67 లేటెస్ట్​ అప్డేట్స్

సరిగ్గా 14 ఏళ్ల క్రితం విజయ్​-త్రిష జంట తమిళ తెరపై సందడి చేసింది. ఆ తర్వాత వారిద్దరిని ఒకే వేదికపై చూసే ఛాన్స్​ దొరకలేదని బాధపడుతున్న ఫ్యాన్స్​కు ఈ కాంబో ఓ స్వీట్​ సర్ప్రైజ్ ఇవ్వనుంది. అదేందంటే..

Thrisha Vijay In New Movie Thalapathy 67
Thrisha Vijay

By

Published : Jan 4, 2023, 8:16 AM IST

తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌ 'విక్రమ్‌' దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. 'మాస్టర్‌' తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు త్రిష, సూర్య, సంజయ్‌దత్‌, అర్జున్‌, నివిన్ పౌలీ​ లాంటి భారీ తారాగణంతో రూపొందనుందనే సమాచారంతో అంతటా ఆసక్తి నెలకొంది. ఈ చిత్ర షూటింగ్‌ చెన్నైలోని ఫిల్మ్‌సిటీలో శరవేగంగా సాగుతున్నట్టు నటుడు మనోబాల మంగళవారం సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. గ్యాంగ్‌స్టర్‌ డ్రామా కథాంశంతో పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో భాగమయ్యామంటూ గౌతమ్‌మేనన్‌, మన్సూర్‌ అలీఖాన్‌ ఇదివరకే తెలిపారు.

ఈ కాంబో సూపర్​హిట్​..
విజయ్, త్రిష కాంబోలో పలు హిట్​ సినిమాలు వచ్చాయి. వీరిద్దరు కలిసి 'గిల్లి', 'కురువి', 'తిరుపాచి','ఆతి' వంటి అనేక చిత్రాలలో పనిచేశారు. అయితే 2008లో రిలీజైన 'కురువి' తర్వాత వీరిద్దరు కలిసి ఒకే స్క్రీన్​పై కనిపించలేదు. మళ్లీ 14 ఏళ్ల తర్వాత ఈ కాంబోతో సినిమా తెరకెక్కుతుండటంతో ఫ్యాన్స్​ ఆనందానికి అవధుల్లేవు. మరోసారి తమ 'గిల్లి' జంట తెరపై రచ్చ చేయనున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details