తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అడివి శేష్‌ 'మేజర్‌' ట్రైలర్‌.. 'సీతా రామం' అప్డేట్​ - seetharaman movie

అడివి శేష్‌ హీరోగా తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం 'మేజర్‌' ట్రేలర్​ను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు చిత్ర బృందం చూపించింది. దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్న 'సీతా రామం' సినిమా అప్డేట్స్​ మీకోసం..

Updates
అప్డేట్స్

By

Published : May 6, 2022, 10:51 PM IST

Updated : May 6, 2022, 10:59 PM IST

అడివి శేష్‌ హీరోగా తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం 'మేజర్‌'. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా రూపొందిన ఈ సినిమా జూన్‌ 3న విడుదలకానుంది. ట్రైలర్‌ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకురానుంది. దేశభక్తి ప్రధానంగా సాగే కథ కావడంతో ట్రైలర్‌ను ముందుగానే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు చిత్ర బృందం చూపించింది. ట్రైలర్‌ను మెచ్చిన ఆయన చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. 'మేజర్‌' స్లోగన్‌ను విడుదల చేశారు. సంబంధిత వీడియోను సోషల్‌ మీడియా అభిమానులతో పంచుకుంటూ శేష్‌ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. శశి కిరణ్‌ తిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శోభిత ధూళిపాళ, సయీ మంజ్రేకర్‌, ప్రకాష్‌ రాజ్‌, రేవతి, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

మేజర్​

'సీతా రామం'

'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన హీరో దుల్కర్‌ సల్మాన్‌. మలయాళం హీరో అయినప్పటికీ తన నటనతో తెలుగులోనూ చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తాజాగా స్వప్న సినిమా పతాకంపై ఈ యంగ్‌ హీరో నటిస్తున్న చిత్రం 'సీతా రామం'. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ను మే9న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని దుల్కర్‌ తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'సీతా రామం మీ మనసులను దోచుకోవడానికి సిద్ధమయ్యారు' అంటూ ట్వీట్‌ చేశారు. రష్మిక కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దుల్కర్‌ సరసన మృణాళిని ఠాకూర్‌ నటిస్తున్నారు. అశ్వినీదత్‌, ప్రియాంకదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రేమకథా దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్‌, గౌతమ్‌ మేనన్‌, ప్రకాష్‌ రాజ్‌లు తదితరులు నటిస్తున్న ఈ ‘యుద్ధంతో’ రాసిన ప్రేమకథను తెలుగుతో పాటు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. పి.ఎస్‌.వినోద్‌ ఛాయాగ్రహణం బాధ్యతలు చేప్పటిన ఈ చిత్రానికి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు.

‘సీతా రామం

ఇదీ చదవండి:'ఆరాధన' మూవీ.. ఇప్పటికీ ఆ రికార్డు ఎన్టీఆర్​, ఏఎన్​ఆర్​, చిరంజీవి ఖాతాలోనే..!

Last Updated : May 6, 2022, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details