Adipurush Collections : పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన 'ఆదిపురుష్' మూవీ.. కలెక్షన్ల పరంగా మొదటి వారం దూసుకెళ్లినప్పటికీ ఆ తర్వాత క్రమ క్రమంగా తగ్గుతూ కనిపిస్తోంది. వీక్‌డేస్‌లో ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతూ కనిపించగా.. ఏడో రోజు వసూళ్లు రూ.5.5 కోట్లు! సినిమా రిలీజై ఇప్పటికీ వారం అవుతుండగా.. నెగిటివిటీతో పాటు సోషల్ మీడియా ట్రోల్స్ ఈ సినిమా కలెక్షన్స్ పై మరింత ప్రభావం చూపుతున్నాయి. దీంతో మొదటి వారం దేశీయ బాక్సాఫీస్ మొత్తం అన్ని భాషలలో కలిపి రూ.260.55 కోట్లకు చేరుకుంది.
అయితే ఈ సినిమా ఆది నుంచికాంట్రవర్సీల నడుమనే థియేటర్లలో సాగుతోంది. వీఎఫ్ఎక్స్ బాలేదని ఒకరు అంటుంటే.. ఇంకొకరేమో పాత్రలను చిత్రీకరించిన విధానం సరికాదని వ్యాఖ్యానించారు. ఇక సినిమాలోని డైలాగ్స్ సైతం వివాదాస్పదంగా ఉందని ప్రేక్షకులు సోషల్ మీడియాలో చిత్ర యూనిట్‌ను దుమ్మెత్తి పోశారు. ఇక రైటర్ సైతం తనను తాను సమర్థించుకున్న తీరు వల్ల ఇప్పటికీ ట్రోల్స్‌కు గురౌతునే ఉన్నారు.
Adipurush Movie : మరోవైపు సినిమాలోని డైలాగ్స్‌లో మార్పులు చేర్పులు చేసిన చిత్రబృందం.. తాజాగా థియేటర్లలో ఎడిటెడ్ వెర్షన్‌ను ప్రదర్శించేందుకు చర్యలు తీసుకుంది. అయినప్పటికీ ఈ సినిమాపైనున్న నెగిటివిటీ వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఏది ఏమైనప్పటికీ వీకెండ్స్‌లో ఈ సినిమా కలెక్షన్లు మళ్లీ జోరందుకనే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. వారంతపు సెలువుల్లో థియేటర్లకు వెళ్లే ఆడియన్స్‌ను బట్టి ఈ సంఖ్యలో మార్పులుండచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా బాక్సాఫీస్ ముందు కూడా ప్రస్తుతం 'ఆదిపురుష్'కు పోటీగా ఏ సినిమా ఆడటం లేదు. దీంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకెళ్లే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాల టాక్. ఇక రిజల్ట్ ఎలా ఉండనుందో అన్న విషయాన్ని వీకెండ్ అయ్యేంతవరకు వేచి చూడాల్సిందే.
ఇక సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్ రాఘవుడిగా, కృతిసనన్ జానకిగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న పాన్ ఇండియా లెవెల్లో రిలీజైంది. రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో సన్నీ సింగ్ లక్ష్మణుడిగా కనిపించగా.. హనుమంతుడి పాత్రను దేవదత్త నాగే పోషించారు. ఇక లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించారు.