Adipurush Advance Booking : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' చిత్రానికి విడుదలకు ముందే అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ముందస్తు టికెట్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా జూన్ 16న విడుదల కానున్న సందర్భంగా కౌంట్‌డౌన్ ప్రారంభమయింది. అందులో భాగంగా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్‌ను ప్రారంభించింది చిత్ర యూనిట్.
సినీ వర్గాల సమాచారం ప్రకారం అమెరికాలో 187 ప్రాంతాల్లో 10, 727 టికెట్లు అమ్ముడుపోయాయి. దీంతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కూడా 'ఆదిపురుష్'.. భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ దేశాల్లో 'కేజీఎఫ్-2' రికార్డులను 'ఆదిపురుష్' బద్దలుగొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ప్రముఖ టికెట్ బుకింగ్ వెబ్సైట్ 'బుక్ మై షో'లో కుడా అనూహ్య స్పందన లభిస్తోంది. ఆ సైట్లో 5 లక్షలకు పైగా ఇంట్రెస్ట్స్ రిజిస్టర్ అయ్యాయి. దీంతో ఈ సినిమా మొదటి రోజు భారీగానే కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. 'ఆదిపురుష్' సినిమాను అమెరికాలో జరగనున్న 'ట్రిబెకా ఫెస్టివల్'లో జూన్ 13న ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా హిందీ భాషలో దాదాపు 4000 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. హిందీ సహా దేశవ్యాప్తంగా 6,200 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు.
KGFను బీట్ చేసిన ఆదిపురుష్.. అడ్వాన్స్ బుకింగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్! - రణ్‌బీర్ కపూర్ ఉచిత ఆదిపురుష్ టికెట్లు
Adipurush Advance Booking : విడుదలకు ముందే ఆదిపురుష్ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఆడ్వాన్స్ టికెట్ బుకింగ్స్‌కు రికార్డు స్థాయిలో స్పందన లభిస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ముందస్తు బుకింగ్స్‌లో కేజీఎఫ్-2 రికార్డును 'ఆదిపురుష్' బీట్ చేసింది.
Adipurush Cast : ఇక 'ఆదిపురుష్' సినిమా విషయానికొస్తే.. రామాయణం ఆధారంగా భారీ బడ్జెట్‌తో రూపొందింది. ఈ చిత్రంలో ప్రభాస్.. రాముడిగా నటించగా.. కృతి సనన్ సీత దేవి పాత్రలో కనిపించారు. లంకాధిపతి రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే నటించారు. ఈ చిత్రం మొత్తం బడ్జెట్ దాదాపు రూ.400 కోట్లకుపైనే ఉంటుందని కొద్ది కాలంగా ప్రచారం సాగుతోంది.
ఆదిపురుష్ టికెట్లు ఉచితం..!
Adipurush Movie Tickets Free : 'ఆదిపురుష్' సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలాన్న లక్ష్యంతో తనవంతుగా 10 వేల టికెట్లు కొనుగోలు చేయనున్నారు రణ్‌బీర్ కపూర్. ఓ ఎన్జీవో సంస్థ ద్వారా ఆ టికెట్లను పేద పిల్లల ఇవ్వనున్నారని తెలిసింది. వారందరికీ హిందూ పురాణాలపై అవగాహన కల్పించాలనే ఆయన ఈ నిర్ణయం తీసుుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో రణ్‌బీర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కార్తికేయ-2, కశ్మీర్ ఫైల్స్ లాంటి చిత్రాల నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా 10 వేల టికెట్లు ఉంచితంగా అందించేందుకు ముందుకొచ్చారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు చెందిన వారికి ఈ టికెట్లను ఉంచితంగా అందించనున్నారు.