తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

న్యూయార్క్​ వీధుల్లో హీరో విశాల్​ - ఆ అమ్మాయి ఎవరంటే ? - న్యూయార్క్​లో హీరో విశాల్​

Actor Vishal Latest Video : కోలీవుడ్ మోస్ట్ వాంటెడ్​ బ్యాచిలర్, నటుడు విశాల్​ తాజాగా న్యూయార్క్​ వీధుల్లో కనిపించారు. అంతే కాకుండా ఆయనతో పాటు ఓ మహిళ కూడా ఉన్నారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ వీడియోపై పలు అభిప్రాయాలను వెల్లగక్కుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?​

Actor Vishal Latest Video
Actor Vishal Latest Video

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 3:12 PM IST

Updated : Dec 26, 2023, 3:22 PM IST

Actor Vishal Latest Video :ఇటీవలే మార్క్​ ఆంటోనీతో హిట్ అందుకున్న కోలీవుడ్ హీరో విశాల్​ ప్రస్తుతం తన అప్​కమింగ్ మూవీస్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన సింగం ఫేమ్​ డైరెక్టర్ హరి డైరెక్షన్​​లో 'రత్నం' మూవీకి సైన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ఈ షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా హీరో విశాల్​ న్యూయార్క్​ వీధుల్లో కనిపించారు. ఓ అమ్మాయితో కలిసి ఆయన కలియతిరుగుతూ కనిపించారు. ఇది చూసి ఒకరు వీడియో తీస్తున్న సమయంలో ఆయన దాన్ని కనిపెట్టి పరుగులు పెట్టడం మొదలెట్టారు. దీన్ని చూసిన ఫ్యాన్స్ షాక్​కు గురవుతున్నారు. ఆయన ఎందుకిలా పరిగెత్తారంటూ నెట్టింట తెగ ఆరా తీస్తున్నారు. అయితే మరికొందరేమో ఇది ప్రమోషనల్ స్టంట్​ అంటూ కొట్టిపారేస్తున్నారు. ఏదీఏమైనప్పటికీ విశాల్ ఈ విషయంపై క్లారిటీ ఇస్తే కానీ అసలేం జరిగిందో తెలియదంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

Vishal Marriage Rumors : మరోవైపు ఇటీవలే తనకు ఓ హీరోయిన్​కు పెళ్లి అంటూ వచ్చిన రూమర్స్​ను సైతం విశాల్ ఖండించారు. "సాధారణంగా నా గురించి వచ్చే ఫేక్ న్యూస్, రూమర్స్​ గురించి స్పందించను. అది అనవసరమని నేను భావిస్తున్నాను. అయితే ఇప్పుడు లక్ష్మీ మేనన్‌తో నా పెళ్లి అన్న రూమర్స్​ వచ్చినందున.. దీన్ని నిర్మొహమాటంగా ఖండిస్తున్నాను. ఆమె నటిగా కంటే ఓ అమ్మాయి అవ్వడం వల్లనే నేను స్పందిస్తున్నాను. మీరు ఒక అమ్మాయి వ్యక్తిగత జీవితాన్ని గురించి ఇలా చెప్పి తన ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు. నేను ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ పెళ్లి చేసుకొంటానో తెలుసుకోవడం బెర్ముడా ట్రయాంగిల్ అంతా కష్టమేమి కాదు. సమయం వచ్చినప్పుడు నా పెళ్లిని అధికారికంగా ప్రకటిస్తాను. గాడ్ బ్లెస్." అంటూ తన మ్యారేజ్​ రూమర్స్​పై క్లారిటీ ఇచ్చారు. ఇక విశాల్‌, లక్ష్మీ మేనన్‌ గతంలో 'పల్నాడు', 'ఇంద్రుడు' వంటి సినిమాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరిపై రూమర్స్‌ మొదలయ్యాయి. ఇక తాజాగా వచ్చిన ట్వీట్​తో వీటికి చెక్​పడట్లు అయ్యింది.

Last Updated : Dec 26, 2023, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details