తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Niharika Chaitanya Divorce : విడాకులు తీసుకున్న నిహారిక- చైతన్య దంపతులు - niharika konidela marriage date

Niharika Chaitanya Divorce : నటి నిహారిక దంపతులు తమ వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. ఈ మేరకు హైదరాబాద్​ కూకట్​పల్లిలోని ఫ్యామిలీ కోర్టు వారికి అధికారికంగా విడాకులు మంజూరు చేసింది.

Niharika Konidela Divorce
విడాకులకు దరఖాస్తు చేసుకున్న నిహారిక దంపతులు.. ఎట్టకేలకు క్లారిటీ..!

By

Published : Jul 4, 2023, 9:24 PM IST

Updated : Jul 5, 2023, 7:19 AM IST

Niharika Chaitanya Divorce : అందరూ ఊహించినట్టే జరిగింది. అవును వారిద్దరూ విడిపోయారు. ఆ జంట మరెవరో కాదు. నటి, నిర్మాత నిహారిక కొణిదెల-చైతన్య జొన్నలగడ్డ. ఈ జంట తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. పరస్పర అంగీకారంతో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో ఇందుకోసం దరఖాస్తు చేసుకోగా, కోర్టు విడాకులను మంజూరు చేసింది.

ఫొటోలు డిలీట్​.. అన్నీ ఒంటరిగానే.. వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని, విడిపోయేందుకు సిద్ధపడ్డారని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. ఎప్పుడు కలిసి తిరిగే ఈ జంట.. చాలా కాలం క్రితమే తాము కలిసి దిగిన ఫొటోలను.. తమ సోషల్‌ మీడియా ఖాతాల నుంచి తొలగించడం వల్ల ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అలానే మెగా కుటుంబంలో జరిగిన వేడుకలన్నింటికీ నిహారిక మాత్రమే హాజరుకావడం పెద్ద చర్చకు దారి తీసింది. ఆ మధ్యలో హాలీవుడ్ ట్రిప్​లకు ఫ్రెండ్స్​తో మాత్రమే కలిసి వెళ్లి ఎంజాయ్​ చేసింది. మరోవైపు చైతన్య కూడా చాలా కాలం పాటు ఎక్కడా కనిపించలేదు. సోషల్​మీడియాలోనూ దాదాపు నాలుగు నెలల నుంచి యాక్టివ్​గా లేడు. రీసెంట్​గానే ఓ పోస్ట్​ పెట్టా తాను ప్రశాంతంగా ఉన్నట్లు పరోక్షంగా తెలిపాడు. అయితే ఇంత జరుగుతున్నా ఈ విషయాలపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు. ఇప్పుడు తాజాగా కోర్టులో విడాకులు తీసుకుని తమ రెండేళ్ల వివాహ బంధానికి ఈ జంట ముగింపు పలికారు.

మూణ్నాళ్ల ముచ్చటగానే..​ నటుడు, నిర్మాత నాగబాబు తనయ అయిన నిహారిక, గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డకు 2020 ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది. 2020 డిసెంబరులో జరిగిన వీరి పెళ్లికి రాజస్థాన్‌ ఉదయపూర్‌లో ఉన్న ఉదయ్ విలాస్‌ వేదికైంది. చాలా మంది సినీ సెలబ్రిటీలు కూడా ఈ పెళ్లికి హజరై సందడి చేశారు. చివరిగా అంత వైభవంగా జరిగిన వీరి వివాహం.. మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఇకపోతే వివాహానంతరం సినిమాలకు దూరమైన నిహారిక డెడ్‌ పిక్సెల్స్‌ వెబ్‌సిరీస్‌తో ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చారు.

Last Updated : Jul 5, 2023, 7:19 AM IST

ABOUT THE AUTHOR

...view details