ప్రముఖ కన్నడ హీరో దిగంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులతో కలిసి గోవా వెళ్లిన ఆయన.. అక్కడ ప్రమాదానికి గురయ్యారు. బీచ్‌లో జంప్ చేసే క్రమంలో.. దిగంత్ మెడకు తీవ్రంగా గాయమైనట్లు సమాచారం. గోవాలో ప్రాథమిక చికిత్స అందించిన కుటుంబ సభ్యులు.. మెరుగైన వైద్యం కోసం.. ప్రత్యేక విమానంలో బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. మణిపాల్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిన స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి భారీగా తలివచ్చారు.
ప్రముఖ నటుడికి తీవ్ర గాయాలు.. గోవా బీచ్‌లో జంప్ చేస్తుండగా.. - kannada actror diganth news
ప్రముఖ కన్నడ హీరో దిగంత్ గాయపడ్డారు. కుటుంబ సభ్యులతో కలిసి గోవా వెళ్లగా.. అక్కడ ఆయనకు ప్రమాదం జరిగింది.
ప్రముఖ నటుడికి తీవ్ర గాయాలు.. గోవా బీచ్‌లో జంప్ చేస్తుండగా..
మిస్ కాలిఫోర్నియా సినిమాతో కన్నడ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు దిగంత్. పలు సినిమాల్లో హీరోగా నటించారు. తెలుగు సినిమా 'వాన'లో కీలక పాత్ర పోషించారు దిగంత్. గాలిపాట, హౌస్‌ఫుల్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం.. అడివి శేష్ నటించిన 'ఎవరు' సినిమా కన్నడ రీమేక్‌లో దిగంత్ నటిస్తున్నారు.
ఇదీ చదవండి:''ప్రిన్స్' పోస్ట్‌పోన్ కాదు.. రిలీజ్ ఆలస్యమంతే' .. ఓటీటీలో 'విక్రమ్' ఎప్పుడంటే?
Last Updated : Jun 21, 2022, 7:32 PM IST