తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ETV WIN బంపర్ ఆఫర్- బ్లాక్ బస్టర్​ హిట్​ '90s మిడిల్ క్లాస్' ఫ్రీగా చూడండిలా - Sri Devi Drama Company Latest

90'S A Middle Class Biopic ETV WIN:తెలుగు లేటెస్ట్ వెబ్​ సిరీస్ '90's ఏ మిడిల్​క్లాస్​ బయోపిక్' ప్రస్తుతం ఇంటర్నెట్​లో ట్రెండింగ్​లో కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ ఈటీవీ విన్​లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆలరిస్తున్న ఈ సిరీస్ ఇప్పటికే 12+ మిలియన్ మినిట్స్ వ్యూస్ దక్కించుకుంది. అయితే ఆడియెన్స్​కు ఈటీవీ విన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ బ్లాక్​బస్టర్ వెబ్ సిరీస్​ను ఫ్రీగా చూసే అవకాశం కల్పించింది. మరి వెంటనే చూసేయండి.

90'S A Middle Class Biopic Latest Promo
90'S A Middle Class Biopic Latest Promo

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 3:19 PM IST

Updated : Jan 17, 2024, 3:30 PM IST

90'S A Middle Class Biopic ETV WIN:టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ (Sivaji), వాసుకీ ఆనంద్‌(Vasuki Anand), మౌళి, వాసంతిక, రోహన్‌, స్నేహల్‌ కామత్‌ కీలక పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ '#90's: ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌'. ఎమోషన్స్, కామెడీ, 90ల్లో జనరేషన్ మధ్య తరగతి పిల్లలు, తల్లిడండ్రుల పరిస్థితులను ఈ వెబ్​ సిరీల్​లో అద్భుతంగా చూపించారు. దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ వెబ్​ సిరీస్​ను ఆరు ఎపిసోడ్​లతో రూపొందించారు. ఈటీవీ విన్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్ ప్రస్తుతం ట్రెండింగ్​లో ఉంది. కాగా, అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కుతున్న ఈ వెబ్‌సిరీస్‌ తొలి ఎపిసోడ్‌ను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించింది ఈటీవీ. తాజాగా రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన సరదా సన్నివేశాన్ని టీమ్ షేర్ చేసుకుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిరీస్​ చూసేయండి.

ETV Dhee Celebrity Special Promo: ఈటీవీలో ఇప్పటి వరకు ఢీ షో ప్రజలను ఆకట్టుకుని సెన్సేషన్​ క్రియేట్ చేసింది. ఎంతో మంది యంగ్ కంటెస్టెంట్స్​ ఈ ప్రోగ్రాంలో తమ ట్యాలెంట్​ను చూపించి టైటిల్​ను గెలుచుకుంటుంటారు. అయితే ఈ సారి మాత్రం సరికొత్తగా 'ఢీ సెలబ్రిటీ స్పెషల్‌' ప్రోగ్రాం ప్రసారమవుతోంది. డ్యాన్స్​తో పాటు కామెడీ కంటెంట్​తో అలరిస్తున్న ఈ షోకు సంబంధించిన తాజా ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది. దాన్ని మీరూ ఓ లుక్కేయండి. సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. జనవరి 17న పూర్తి ఎపిసోడ్‌ ప్రసారం కానుంది.

ETV Jabardasth Latest Promo:ఈటీవీలో ప్రసారమవుతున్న 'జబర్దస్త్​' ప్రొగ్రాంకు బుల్లితెర షోస్​లో ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ప్రతి గురువారం ఆడియెన్స్​ను అలరిస్తున్న ఈ కామెడీ షో ఎప్పటిలాగే సరికొత్త స్కిట్‌లతో నవ్వులు పంచేందుకు సిద్ధమైంది. జనవరి 18న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌ ప్రోమోను మీరూ ఓ సారి చూసేయండి.

Extra Jabardasth Latest Promo: ప్రతి శుక్రవారం టీవీ ప్రేక్షకులకు అలరించేందుకు 'ఎక్స్‌ట్రా జబర్దస్త్‌' మరో కొత్త కంటెంట్​తో ముందుకొచ్చింది. ఎప్పటిలాగే ఈ వారం కూడా సరికొత్త స్కిట్‌లతో ఆడియెన్స్​ను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమైంది. జనవరి 19న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలై నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మీరూ ఓ లుక్కేయండి.

Sri Devi Drama Company Latest Promo: అటు కామెడీతో పాటు ఇటు కంటెంట్​ను అందిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు ఆకట్టుకుంటోంది 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోగ్రాం. ప్రతి ఆదివారం వినోదం పంచుతున్న ఈ కార్యక్రమం ఈ సారి మరింత కొత్తగా అలరించేందుకు సిద్ధమైంది. జనవరి 21న టెలికాస్ట్​ కానున్న తాజా ఎపిసోడ్‌ ప్రోమోనూ ఓ సారి చూసేయండి.

How To Watch ETV Win For Free : ఈటీవీ విన్ బంపర్ ఆఫర్​.. వీకెండ్​లో ఫ్రీగా సినిమాలు, షోస్ స్ట్రీమింగ్

'90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్'కు విశేష స్పందన- 'ETV WIN​'లో రికార్డ్స్ బ్రేక్!

Last Updated : Jan 17, 2024, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details