తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

టాలీవుడ్​ను వెంటాడుతున్న వాయిదాల పర్వం- ఒకేసారి 3 సినిమాలు పోస్ట్​పోన్​! - Telugu Movies Postponed 2023

2023 Tollywood Release Movies : టాలీవుడ్​లో వాయిదాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు మూవీ టీమ్స్​ తమ చిత్రాల విడుదల తేదీల్లో మార్పులు చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో 3 తెలుగు సినిమాలు తమ రిలీజ్​లను వాయిదా వేసుకున్నాయి. ఇంతకీ అవేవంటే?

Back To Back Telugu Movies Postponements
Telugu Movies Postponed 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 9:28 PM IST

Updated : Nov 3, 2023, 11:40 AM IST

2023 Tollywood Release Movies : ఈ మధ్య టాలీవుడ్​ ఇండస్ట్రీలో వాయిదాల పరంపర కొనసాగుతోంది. చిన్నా, పెద్దా అంటూ తేడా లేకుండా దర్శకనిర్మాతలు ఉన్నట్టుండి తమ సినిమాల విడుదల తేదీల్లో మార్పులు చేస్తున్నారు. ఇందుకు బలమైన కారణాలు కూడా లేకపోలేదు. తమ సినిమా విడుదల సమయానికి మరో హీరోల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావటం పెద్ద సమస్యగా మారుతోంది. ఇదే కాకుండా ఇతర కారణాలతోనూ షెడ్యూల్​ చేసుకున్న మూవీ రిలీజ్​ తేదీలను పోస్ట్​పోన్​ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నవంబర్, డిసెంబర్​​ నెలల్లో కూడా విడుదలకు సిద్ధమై పలు కారణాలతో రిలీజ్​ తేదీల్లో మార్పులు చేసుకున్న ఆ మూడు తెలుగు సినిమాలు ఇవే..

'డెవిల్'..
'ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్' అనే ట్యాగ్ లైన్​తో నందమూరి కళ్యాణ్​ రామ్ నటించిన తాజా పీరియాడిక్​ యాక్షన్​ చిత్రం 'డెవిల్'. ఈ సినిమాలో సంయుక్తా మేనన్​ కథానాయికగా నటించింది. 'బింబిసార' తర్వాత కళ్యాణ్ రామ్ - సంయుక్త కలిసి మరోసారి నటించిన చిత్రమిదే కావడం విశేషం. ఈ సినిమాను ముందుగా నవంబర్ 24న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేశారు​. అయితే సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్​లో ఉండటం వల్ల ఈ మూవీ రిలీజ్​ను వాయిదా వేశారట. దీంతో కొత్త డేట్​ను ఇంకా ఫిక్స్​ చేయాల్సి ఉంది. అయితే బ్యాక్​గ్రౌండ్ స్కోర్​, విజువల్ ఎఫెక్ట్స్ (గ్రాఫిక్స్) వర్క్ ఇంకా పూర్తి కాలేదని, అందువల్ల థియేటర్లలోకి ముందుగా ప్రకటించిన తేదీకి కాకుండా కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు 'డెవిల్'​ను తీసుకువస్తామని చిత్రయూనిట్​ చెప్పింది. దీంతో త్వరలోనే కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.

'ఆదికేశవ'..
ఈనెల వాయిదా పడ్డ మరో సినిమా 'ఆదికేశవ'. వైష్ణవ్ తేజ్ - శ్రీలీల లీడ్​ రోల్స్​లో దర్శకుడు శ్రీకాంత్​ ఎన్​ రెడ్డి రూపొందించిన ఈ చిత్రం కూడా ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రపంచ కప్ నేపథ్యంలో ఆ ఎఫెక్ట్​ మూవీపై పడకూడదని నవంబర్​ 10న రిలీజ్​ కావాల్సిన 'ఆదికేశవ' సినిమాను నవంబర్​ 24కి వాయిదా వేసినట్లు మూవీ టీమ్​ వెల్లడించింది.

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'..
Gangs Og Godavari Release Date : విశ్వక్​ సేన్​ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న లేటెస్ట్​ మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. వాస్తవానికి డిసెంబర్​ మొదటి వారంలో ఈ సినిమా విడుదల కావాల్సింది. అయితే అప్పటికే నేచురల్​​ స్టార్​ నాని నటించిన 'హాయ్​ నాన్న' డిసెంబర్​ 7న, హీరో నితిన్​ నటించిన ఎక్స్​ట్రా- ఆర్డినరీ మ్యాన్ డిసెంబర్​ 8న రిలీజ్​ కానున్నాయి. దీంతో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. అలా డిసెంబర్​ 8న విడుదల కావాల్సిన విశ్వక్​ సేన్​ మూవీ విడుదల 29కి వాయిదా పడ్డట్లు సమాచారం.

కనిపించీ కనిపించనట్టుగా అను ఇమ్మాన్యుయేల్ అందాల ప్రదర్శన

పింక్​ శారీలో సమంత హొయలు, చీర కొంగు అందాలతో కట్టిపడేసిందిగా!

Last Updated : Nov 3, 2023, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details