తెలంగాణలో ఇన్ని అభివృద్ధి పనులు ఎలా సాధ్యమవుతున్నాయని చాలా మంది అడుగుతున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మహబూబాబాద్ తెరాస బహిరంగ సభకు హాజరైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో రైతులు, ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని అన్నారు. ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులకు పింఛన్లు ఇవ్వాలని ఎవరూ అడగలేదని తెలిపారు. ఎవరూ అడగకుండానే ప్రజల అవసరాలు గుర్తించి పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
'ప్రజల అవసరాలు గుర్తించి పథకాలు అమలు చేశాం' - 2019 ELECTIONS
రాష్ట్రంలో తెరాస ప్రచార జోరు పెంచింది. ఓవైపు కేసీఆర్... మరోవైపు కేటీఆర్ వరుస సభలు, రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్‌లో బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. మరోసారి తన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకున్నారు.
'ప్రజల అవసరాలు గుర్తించి పథకాలు అమలు చేశాం'